దొంగిలించిన కారును రెండేళ్లుగా వాడుకుంటూ దొరికిపోయిన పోలీస్

దొంగిలించిన కారును రెండేళ్లుగా వాడుకుంటూ దొరికిపోయిన పోలీస్

Stolen Car: కాన్పూర్ బిత్తూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం దొంగిలించిన కారును సైలెంట్ గా వాడేస్తున్నాడు. అంతేకాదు దానికి సర్వీసులు లాంటివి కూడా చేయిస్తున్నాడు. రీసెంట్ గా సర్వీస్ సెంటర్ నుంచి ఒరిజినల్ యజామానికి ఫోన్ వెళ్లడంతో ఫీడ్ బ్యాక్ గురించి అడిగారు. అంతే అసలు విషయం బయటకు వచ్చింది.

కార్ ఎవరు తీసుకువచ్చారు.. సర్వీస్ డిటైల్స్ తనకు తెలియజేయాలని యజమాని అడిగాడు. మీరు ఇచ్చిన వెహికల్ సర్వీసింగ్ పూర్తి చేసి బిత్తూర్ పోలీస్ స్టేషన్ కు తిరిగి పంపేసినట్లు సమాచారం అందింది. కౌషలేంద్ర ప్రతాప్ సింగ్ అనే ఆఫీసర్ పర్సనల్ యూజ్ కోసం దొంగింలిచన వాహనాన్ని వాడేసుకుంటున్నాడు. రెండేళ్ల క్రితమే ఒమేంద్ర సోనీ అనే వ్యక్తి తన కారు పోయిదంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

2018 డిసెంబర్ 31న కార్ వాషింగ్ సెంటర్ నుంచి దొంగిలించారు. అప్పుడే బర్రా అనేప్రాంతం నుంచి కంప్లైంట్ వెళ్లింది. పోయిన వాహనాన్ని పట్టుకోలేకపోయామని పోలీసులు కేసు క్లోజ్చేశారు. పోగొట్టుకున్న వాహనాలకు ఎలాగోలా ఇన్సూరెన్స్ పొందొచ్చని అనుకున్నారు.

ఈ క్రమంలో బుధవారం అతనికి కేటీఎల్ సర్వీస్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. అతను పొరబాటుగా వచ్చిందని భావించి ప్రశ్నలు అడగడంతో వచ్చిన సమాధానాలకు షాక్ అయ్యాడు. కచ్చితంగా అవే వివరాలు చెప్తుండటంతో ఆ వాగనార్ ఎక్కడిది.. సర్వీస్ కు ఎవరిచ్చారు అని చెప్పడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. డిసెంబర్ 22న దానికి సర్వీసింగ్ పూర్తి అయిన తర్వాత స్టేషన్ ఆఫీసర్ కౌసలేంద్ర ప్రతాప్ సింగ్ కార్ రికవరీ అయ్యాక కూడా తనకెందుకు చెప్పలేదని అనుమానంతోమరోసారి స్టేషన్ కు వెళ్లారు.

రూల్ ప్రకారం.. సీజ్ చేసిన వెహికల్స్ పోలీసులు వాడటానికి వీల్లేదు. కానీ, దేశవ్యాప్తంగా అక్కడక్కడడఇలాంటివి జరుగుతూనే ఉంటాయని రికార్డులు చెబుతున్నాయి.