Viral Video: దుకాణంలో పోలీసు తుపాకీ మిస్ ఫైర్.. ఉద్యోగికి తీవ్రగాయాలు

దుకాణంలో ఓ పోలీసు తుపాకీ మిస్ ఫైర్ అయి అందులో పనిచేసే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దీంతో బాధితుడు తీవ్రగాయాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన పంజాబ్ లోని అమృత్‌సర్ లో చోటు చేసుకుంది. ఓ పోలీసు మొబైల్ షాప్‌కి వెళ్లి జేబులోని తుపాకీ తీస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా ఫైర్ అయిందని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

Viral Video: దుకాణంలో పోలీసు తుపాకీ మిస్ ఫైర్.. ఉద్యోగికి తీవ్రగాయాలు

Viral Video: దుకాణంలో ఓ పోలీసు తుపాకీ మిస్ ఫైర్ అయి అందులో పనిచేసే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దీంతో బాధితుడు తీవ్రగాయాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన పంజాబ్ లోని అమృత్‌సర్ లో చోటు చేసుకుంది. ఓ పోలీసు మొబైల్ షాప్‌కి వెళ్లి జేబులోని తుపాకీ తీసి, దాన్ని మరొకరికి చూపించిన సమయంలో అది అకస్మాత్తుగా ఫైర్ అయిందని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీనిపై అమృత్‌సర్ నార్త్ ఏసీపీ వీరేందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. పోలీసుపై తగిన చర్యలు తీసుకుంటాం. గాయపడ్డ మొబైల్ దుకాణ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది’’ అని చెప్పారు. కాగా, తుపాకీ మిస్ ఫైర్ కు కారణమైన ఆ పోలీసును అధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు, జమ్మూకశ్మీర్ లోనూ ఈ నెల తొలివారంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ పోలీసు రైఫిల్ మిస్ ఫైర్ కావడంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.

https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw