Viral Video: రోడ్డు పక్కనే కారు ఆపి డోరు తెరిచిన వ్యక్తి.. స్కూటర్‌పై వెనుక నుంచి వచ్చిన మహిళ ఢీ కొన్న వైనం

రోడ్డుకి ఎడమవైపున కారు ఆపాడు ఓ వ్యక్తి. అంతేగాక, వెనుక నుంచి వస్తున్న వాహనాలను చూసుకోకుండా కారు తలుపు తీశాడు. దీంతో, స్కూటర్ పై వస్తున్న ఓ మహిళ కారు తలుపునకు తగిలి ఎగిరిపడింది. ఆమె పైకి మరో కారు ఎక్కేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కర్ణాటక రోడ్ సేఫ్టీ అథారిటీ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Viral Video: రోడ్డు పక్కనే కారు ఆపి డోరు తెరిచిన వ్యక్తి.. స్కూటర్‌పై వెనుక నుంచి వచ్చిన మహిళ ఢీ కొన్న వైనం

Viral Video: రోడ్డుకి ఎడమవైపున కారు ఆపాడు ఓ వ్యక్తి. అంతేగాక, వెనుక నుంచి వస్తున్న వాహనాలను చూసుకోకుండా కారు తలుపు తీశాడు. దీంతో, స్కూటర్ పై వస్తున్న ఓ మహిళ కారు తలుపునకు తగిలి ఎగిరిపడింది. ఆమె పైకి మరో కారు ఎక్కేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కర్ణాటక రోడ్ సేఫ్టీ అథారిటీ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

కారు తలుపు తెరిచే ముందు వెనుక నుంచి ఏవైనా వాహనాలు వస్తున్నాయా? అన్న విషయాన్ని కారు అద్దంలో నుంచి చూసి తెలుసుకుని, ఆ తర్వాతే తలుపు తెరవాలని పేర్కొంది. ఆ ప్రమాదానికి గురైన మహిళకు సంబంధించిన ఇతర వివరాలు తెలపలేదు. వెనుక నుంచి ఎవరైనా వస్తున్నారా? అన్న విషయాన్ని గుర్తించకుండా కారు డ్రైవర్లు తలుపులను తెరవడం, వెనుక నుంచి వాహనాలు వచ్చి ఆ డోరుకు ఢీ కొనడం వంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి ఘటనపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..