Viral Video: జైలు నుంచి 98 ఏళ్ల వృద్ధుడు విడుదల.. ఫేర్‌వెల్ ఇచ్చిన జైలు సిబ్బంది

ఆ వృద్ధుడి పేరు రామ్ సూరత్.. ఓ కేసులో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య జైల్లో ఐదేళ్లుగా ఉన్నాడు. ఇప్పుడు అతడి వయసు 98 ఏళ్లు. అతడి శిక్షాకాలం ముగియడంతో పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా అతడికి జైలు సిబ్బంది ఫేర్‌వెల్ ఇచ్చారు. పూలదండ వేసి, శాలువా కప్పి సత్కరించి, డబ్బులిచ్చి పంపారు.

Viral Video: జైలు నుంచి 98 ఏళ్ల వృద్ధుడు విడుదల.. ఫేర్‌వెల్ ఇచ్చిన జైలు సిబ్బంది

Viral Video

Viral Video: ఆ వృద్ధుడి పేరు రామ్ సూరత్.. ఓ కేసులో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య జైల్లో ఐదేళ్లుగా ఉన్నాడు. ఇప్పుడు అతడి వయసు 98 ఏళ్లు. అతడి శిక్షాకాలం ముగియడంతో పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా అతడికి జైలు సిబ్బంది ఫేర్‌వెల్ ఇచ్చారు. పూలదండ వేసి, శాలువా కప్పి సత్కరించి, డబ్బులిచ్చి పంపారు.

ఆ వృద్ధుడిని తీసుకు వెళ్లడానికి అతడి కుటుంబ సభ్యులు ఎవరూ జైలు వద్దకు రాలేదు. దీంతో పోలీసులే అతడిని కారులో ఇంటి వద్ద దించిపెట్టారు. రామ్ సూరత్ ను పోలీసులు సత్కరించిన వీడియోను జైళ్ల శాఖ డీజీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వృద్ధుడిపై గతంలో ఐపీసీ సెక్షన్లు 452, 323, 352 కింద కేసు నమోదై, దోషిగా తేలాడని పోలీసులు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

పోలీసులు ఇన్నాళ్లు ఆ వృద్ధుడిని జైలులో ఉంచి తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి, ఆ వృద్ధుడు విడుదల అయ్యే సమయంలో అతడిని సన్మానించి మనిషిగా బాధ్యతలను నిర్వర్తించారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఆ వృద్ధుడిపై పోలీసులు చూపించిన జాలి, దయ, కరుణ చాలా గొప్పవని మరికొందరు నెటిజన్లు అన్నారు. ఆ వీడియో చూసి, తనకు కలిగిన భావాలు చెప్పడానికి మాటలు రావడం లేదని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.

AP Politics : మరోసారి చంద్రబాబు, పవన్ భేటీలపై బీజేపీ సమాలోచనలు.. ఏపీలో పొత్తులపై కమలదళం స్టాంట్ ఏంటీ?!