Viral Video: తుపాకులు పట్టుకుని దోపిడీకి వచ్చిన వారితో పోరాడి తరిమేసిన మహిళా కానిస్టేబుళ్లు

తుపాకులు పట్టుకుని బ్యాంకులో దోపిడీకి వచ్చిన వారితో పోరాడి, వారిని తరిమేశారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళా కానిస్టేబుళ్లు ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బిహార్ లోని హాజీపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: తుపాకులు పట్టుకుని దోపిడీకి వచ్చిన వారితో పోరాడి తరిమేసిన మహిళా కానిస్టేబుళ్లు

Viral Video

Viral Video: తుపాకులు పట్టుకుని బ్యాంకులో దోపిడీకి వచ్చిన వారితో పోరాడి, వారిని తరిమేశారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళా కానిస్టేబుళ్లు ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బిహార్ లోని హాజీపూర్ లో ఓ బ్యాంకు వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కాపలాగా ఉన్నారు.

ఆ సమయంలో ముగ్గురు దొంగలు తుపాకులతో బ్యాంకులోకి ప్రవేశించి, అక్కడి వారిని బెదిరించి దోచుకోవడానికి యత్నించారు. దొంగలను చూసిన వెంటనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పోరాడారు. వారు పోరాడిన తీరుకు భయపడి అక్కడి నుంచి ఆ ముగ్గురు దొంగలు పారిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు అధికారులు ఈ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ప్రశంసించారు.

ఆ మహిళా కానిస్టేబుళ్ల పేర్లు జుహీ కుమారి, శాంతి కుమారి అని చెప్పారు. వారిద్దరికీ రివార్డు ఇచ్చామని వివరించారు. ఈ సందర్భంగా శాంతి కుమారి మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఉన్నతాధికారులు మమ్మల్ని ప్రశంసించారు. దొంగలను ఎదిరిని ధైర్యం చూపామని చెప్పారు’’ అని తెలిపారు. మహిళా కానిస్టేబుళ్లు దొంగలను ఎదిరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Russia vs Ukraine War: యుక్రెయిన్‌కు బ్రాడ్లీ యుద్ధ వాహనాలు.. భారీగా రక్షణ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా..