Viral Video: న్యూ ఇయర్ వేడుకల్లో మహిళలతో సెల్ఫీలకు యువకుల యత్నం.. తన్నులాట జరిగిన వైనం

న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా, ఫస్ట్ ఎవెన్యూ సిటీ పార్క్ అపార్టుమెంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపులకు చెందిన వారి మధ్య తన్నులాట చోటుచేసుకుంది. హౌసింగ్ సొసైటీకి చెందిన మహిళలతో సెల్ఫీలు తీసుకునేందుకు కొందరు యువకులు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చెలరేగింది.

Viral Video: న్యూ ఇయర్ వేడుకల్లో మహిళలతో సెల్ఫీలకు యువకుల యత్నం.. తన్నులాట జరిగిన వైనం

Viral Video

Viral Video: న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు మునిగితేలుతున్న వేళ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా, ఫస్ట్ ఎవెన్యూ సిటీ పార్క్ అపార్టుమెంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపులకు చెందిన వారి మధ్య తన్నులాట చోటుచేసుకుంది. హౌసింగ్ సొసైటీకి చెందిన మహిళలతో సెల్ఫీలు తీసుకునేందుకు కొందరు యువకులు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చెలరేగింది.

సెల్ఫీలు తీసుకోవద్దని, తమకు ఇబ్బంది కలుగుతుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారితో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. పలువురు మహిళలపై కొందరు దాడికి కూడా దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇద్దరు-ముగ్గురిని కస్టడీలోని తీసుకున్నారు.

నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. అక్కడ కొందరు యువకులు ఘర్షణ పడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ పార్టీలో పరస్పరం రెండు గ్రూపులు కొట్టుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.

China Corona Virus : చైనాలో కరోనా విలయ తాండవం.. వైరస్ సోకి రోజుకు 9 వేల మంది మృతి