Viral Video: పెళ్లికూతురికి సర్ ప్రైజ్ ఇచ్చిన స్నేహితులు.. కన్నీరు పెట్టుకున్న వధువు
ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ డ్యాన్సుతో సర్ ప్రైజ్ ఇచ్చారు. మెహందీ వేడుక సందర్భంగా ఆ అమ్మాయి ఇద్దరు స్నేహితులు డ్యాన్స్ తో అదరగొట్టారు. ఆ సమయంలో పెళ్లికూతురు చెప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తోంది. అదే సమయంలో మూడో వ్యక్తి ఓ గదిలో నుంచి వచ్చి సర్ ప్రైజ్ ఇస్తూ డ్యాన్స్ చేశాడు.

Viral Video: ఓ అమ్మాయి మెహందీ వేడుక సందర్భంగా ఆమెకు స్నేహితులు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఆ పెళ్లికూతురు సంతోషంతో కన్నీరు ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ యువతికి మిత్రులు ఇచ్చిన సర్ ప్రైజ్ అద్భుతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ డ్యాన్సుతో సర్ ప్రైజ్ ఇచ్చారు. మెహందీ వేడుక సందర్భంగా ఆ అమ్మాయి ఇద్దరు స్నేహితులు డ్యాన్స్ తో అదరగొట్టారు. ఆ సమయంలో పెళ్లికూతురు చెప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తోంది. అదే సమయంలో మూడో వ్యక్తి ఓ గదిలో నుంచి వచ్చి సర్ ప్రైజ్ ఇస్తూ డ్యాన్స్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే ఆ పెళ్లికూతురు ఆనందభాష్పాలు రాల్చింది. ఆమె స్నేహితులు హే బేబీ సినిమాలోని మస్త్ కలందర్ పాటకు డ్యాన్స్ చేశారు. దీపేశ్ మిశ్రా అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
View this post on Instagram
Harish Shankar : పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు.. హరీష్ శంకర్ సంచలన కామెంట్స్..