West Bengal Dengue Cases: పశ్చిమ బెంగాల్లో డెంగీ విజృంభణ.. ఒక్క రోజులో 840 కేసులు

 పశ్చిమ బెంగాల్లో డెంగీ పడగ విప్పింది. నిన్న 840 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 7,682 శాంపిళ్లను పరీక్షించగా ఈ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వివరించారు. దీంతో అక్కడి వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎయిర్ కూలర్లు, ఇళ్ల ముందు, ఇతర ప్రాంతాల్లో నీళ్ల నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు దోమ తెరలు వాడాలని అన్నారు.

West Bengal Dengue Cases: పశ్చిమ బెంగాల్లో డెంగీ విజృంభణ.. ఒక్క రోజులో 840 కేసులు

West Bengal Dengue Cases: పశ్చిమ బెంగాల్లో డెంగీ పడగ విప్పింది. నిన్న 840 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 7,682 శాంపిళ్లను పరీక్షించగా ఈ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వివరించారు. దీంతో అక్కడి వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎయిర్ కూలర్లు, ఇళ్ల ముందు, ఇతర ప్రాంతాల్లో నీళ్ల నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ప్రజలు దోమ తెరలు వాడాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న డెంగీ రోగుల సంఖ్య 541గా ఉందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు, హౌరా, కోల్ కతా, హూగ్లీ, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, జల్పైగురి, డార్జీలింగ్ జిల్లాల్లో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయని వివరించారు.

పలు ప్రాంతాల్లో దోమల నివారణకు అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. డెంగీ పరీక్షల సంఖ్యను పెంచారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండడంతో డెంగీ నివారణకు సంబంధించిన మందులు, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించారు.

Modi Landed in Tokyo: జపాన్ చేరుకున్నానంటూ ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ