ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇండియన్ విస్కీల హల్‌చల్

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇండియన్ విస్కీల హల్‌చల్

indian whisky

Indian whisky: ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద ఆల్కహాల్ వినియోగదారిగా ఉంది. లండన్ ఆధారిత రీసెర్చ్ ఫామ్ చేసిన ఐడబ్ల్యూఎస్ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలసిస్ ఈ విషయం వెల్లడించింది. ఇండియాలో మోస్ట్ ఫేవరేట్ గా తీసుకుంటున్న స్పిరిట్స్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, టకీలా, లిక్కర్స్.

ఇండియాలో 663మిలియన్ లీటర్లకు పైగా ఆల్కహాల్‌ తాగేశారు. 2017లెక్కల ప్రకారం.. 11శాతం పెరిగింది. ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించొచ్చు. అయినా ఇండియన్ మేడ్ లో రెడీ అవుతున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎమ్ఎఫ్ఎల్) ప్రొడ్యూస్ చేసిన విస్కీలు, జిన్లు, వైన్లతో పాకెట్లు నింపుకుంటున్నాయి.

ప్రపంచాన్ని ఏలుతున్న ఆ మూడు ఇండియన్ మేడ్ టాప్ బ్రాండ్లు తెలుసుకోవాలనుందా..
1. రామ్‌పూర్ (ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ నాన్ చిల్ ఫిల్డర్డ్)
పేరులోనే ఉంది కదా రామ్ పూర్ అని. అక్కడే రెడీ అవుతున్న ఈ విస్కీని హిమాలయాల్లో ఉంచి రెడీ చేస్తారు.

2. అమృత్ (ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ)
రుచికి ఆరెంజ్ సైట్రస్, కోకోవా, స్మూత్ టఫ్ఫీలను గుర్తు చేస్తుంది. బెంగళూరులో రెడీ అవుతుంది.

3. పాల్ జాన్ ఎడిటెడ్ సింగిల్ మాల్ట్ విస్కీ
గోవాలో పాల్ జాన్ డిసిలరీ దీనిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియా బార్లీ, స్కాటిష్ బార్లీతో మిక్స్ చేస్తారు. స్పైస్, చాక్లెట్, కాఫీ ఫ్లేవర్లలో దొరుకుతుంది.