Viral Video: రోడ్డు పక్కన ఈ యువకుడు పాడిన పాటకు పోలీసులు ఫిదా

సామాజిక మాధ్యమాల్లో కనపడే కొన్ని వీడియోలు మనలో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. అటువంటి వీడియోనే ఇది. ఓ యువకుడు పోలీసుల ముందు గిటారు వాయిస్తూ బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రలోని కేసరియా పాట పాడాడు. ఆ పాటకు ఇద్దరు పోలీసులు ఫిదా అయిపోయారు. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివ అనే ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ చేశాడు.

Viral Video: రోడ్డు పక్కన ఈ యువకుడు పాడిన పాటకు పోలీసులు ఫిదా

Viral Video

Viral Video: సామాజిక మాధ్యమాల్లో కనపడే కొన్ని వీడియోలు మనలో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. అటువంటి వీడియోనే ఇది. ఓ యువకుడు పోలీసుల ముందు గిటారు వాయిస్తూ బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రలోని కేసరియా పాట పాడాడు. ఆ పాటకు ఇద్దరు పోలీసులు ఫిదా అయిపోయారు. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివ అనే ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ చేశాడు.

అతడు ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్ వచ్చాయి. రోడ్డు పక్కన ఓ యువకుడు పాట పాడుతుండగా ఓ పోలీసు బైకుపై కూర్చొని విన్నాడు. మరో పోలీసు అక్కడే నిలబడి ఆ పాట వింటూ పులకించిపోయాడు. ఆ యువకుడు పోలీసుల ముందు ఎందుకు ఇలా గిటారు వాయిస్తూ పాట పాడాడన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.

ఆ యువకుడు పాడిన పాటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒత్తిడిమయ జీవితం గడుపుతున్న వారు ఆ పాటను వింటే ఉపశమనం పొందుతారని కొందరు కామెంట్లు చేశారు. ఈ పాట విన్నాక ఆ ఇద్దరు పోలీసులు మరింత హుషారుగా తమ విధులు నిర్వర్తించి ఉండవచ్చని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by SHIV (@shi.vxm)

Corona Cases : దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు, వైరస్ సోకి ఒకరు మృతి