Indian Air Force Recruitment 2020: Notification released

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత వైమానిక దళం (IAF) ఎయిర్‌ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ x, గ్రూప్ y ట్రేడ్స్ ఎయిర్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 2020 జనవరి 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక అభ్యర్ధులను మొదటి దశ, రెండో దశ పరీక్షలు, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.  

విద్యార్హత:
గ్రూప్ x ట్రేడ్‌కు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ కావాలి, లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాస్ కావాలి.

> గ్రూప్ y ట్రేడ్‌కు ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ కావాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ 50% మార్కులతో పాస్ కావాలి.

వయస్సు: 
2000 జనవరి 17 నుంచి 2003 డిసెంబర్ 30 మధ్య పుట్టినవారే అర్హులు. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 2, 2020.

దరఖాస్తు చివరితేది: జనవరి 20, 2020.
 

Related Posts