లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

బైడెన్ “కరోనా టాస్క్ ఫోర్స్ “లో భారత సంతతి వ్యక్తి

Published

on

Indian-American Vivek Murthy ఈ టాస్క్ ఫోర్స్ లో ముగ్గురు కో-చైర్మెన్ లు ఉంటారు. మాజీ ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA)మాజీ కమిషనర్ డేవిడ్ కీస్లర్,మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి,యేల్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ మార్సెల్లా నునెజ్ స్మిత్ ఈ సలహామండలిలో సభ్యులుగా ఉన్నారు.విల్మింగ్టన్‍, డెలావర్‍ లో బైడెన్‍ ఇచ్చిన విక్టరీ స్పీచ్‍లో నేను శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాను. వారు బైడెన్‍- హారిస్‍ కొవిడ్‍ ప్లాన్‍ను బ్లూప్రింట్‍గా మార్చడానికి కృషి చేస్తారు. అది జనవరి నుంచి అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే, బైడెన్ ఎంపిక చేసిన టీమ్ లో ఇండియన్-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి కూడా ఉన్నారు. ముగ్గురు సహ చైర్మన్లలో ఈయన కూడా ఒకరు. మాజీ యుఎస్ సర్జన్ జనరల్ అయిన మూర్తి.. ప్రజారోగ్య నిపుణుల బృందానికి, బైడెన్ కి, ఉపాధ్యక్షరాలిగా పదవి చేపట్టనున్న కమలా హారిస్ కి తగిన సలహాలు, సూచనలు ఇస్తారు.కర్ణాటటకు చెందిన మూర్తి(43)ని అమెరికా 19వ సర్జన్‍ జనరల్‍గా అప్పటి (2014) అధ్యక్షుడు ఒబామా నియమించారు. బ్రిటన్‍లో పుట్టిన వివేక్‍ మూర్తి 37 ఏళ్ల వయసులోనే సర్జన్‍ జనరల్‍గా నియమితులై రికార్డు సృష్టించారు. అయితే తర్వాత వచ్చిన ట్రంప్‍ ప్రభుత్వం ఆయనను వైదొలగాలని కోరింది.ప్రస్తుతం అమెరికాలోని కనీసం 40 రాష్ట్రాల్లో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇవి 90 లక్షలకు పైగా పెరిగాయి, 2 లక్షల 36 వేలమంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *