లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Indian Army Day 2021 : అగ్గిపుల్లలతో భారత ఆర్మీ యుద్ధ ట్యాంకు తయారు చేసిన యువకుడు

Published

on

indian army day 2021 : జనవరి 15 ఇండియన్ ఆర్మీడే.ఈరోజు భారతదేశం 73వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన ఓ యువకుడు అగ్గిపుల్లలతో ఓ యుద్ధట్యాంకును తయారు చేశాడు. ఒడిశాలోని పూరికి చెందిన శశ్వత్ రంజన్ సాహు అనే యువ కళాకారుడు అగ్గిపుల్లలతో తయారు చేసిన యుద్ధట్యాంకు అందరినీ ఆకట్టుకుంటోంది. శశ్వంత కళాత్మకతను చూసినవారంతా సెల్యూట్ చేస్తున్నారు.

2వేల 256 అగ్గిపుల్లలను ఉపయోగించి ఓ యుద్ధట్యాంకును రూపొందించాడు. భారతదేశం
74వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా శశ్వంత ఈ యుద్ధట్యాంకును తయారు చేశాడు.

ఇండియన్ ఆర్మీడే సందర్భంగా తాను తాయరు చేసిన ఈ యుద్ధట్యాంకు గురించి శశ్వంత్ మాట్లాడుతూ..భారత్ ఆర్మీ శౌర్యాలను..ప్రతాపాలను..ధైర్యసాహసాలను గుర్తు చేసుకోవటానికి జరిగే ఈ వేడుకల సందర్భంగా తాను అగ్గిపుల్లలతో ఈ యుద్ధ ట్యాంకును తయారు చేశానని తెలిపాడు. దీనికి 6 రోజుల సమయం పట్టిందని తెలిపాడు. 9 అంగుళాల ఎత్తు.. వెడల్పు 8 అంగుళాలు కలిగిన ఈ యుద్ధట్యాంకు తయారీకి 2వేల 256 ఉపయోగించానని తెలిపాడు.

కాగా ప్రతీ సంవత్సరం ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాన పరేడ్‌లో మిలటరీ హార్డ్‌వేర్, యుద్ధ ట్యాంకులు వంటివి ప్రదర్శిస్తారు.. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది. దేశం కోసం సైనికులు చేస్తోన్న త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను (Indian Army Day) నిర్వహిస్తారు. ఈరోజు ఏర్పాటు చేసే వేడుకల్లో భాగంగా సైనికులకు శౌర్య పురస్కారాలు, సేన పతకాలు అందజేస్తారు. ఈ సంవత్సరం భారతదేశం 74వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.