Home » బంగ్లాదేశ్ కు గుర్రాలు, కుక్కల్ని గిప్టుగా ఇచ్చిన భారత సైన్యం
Published
3 months agoon
By
nagamaniIndian army gifts 20 horses,10 dogs to bangladesh : భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ కు 20 గుర్రాలను,10 కుక్కలను బహుమతిగా అందజేసింది. పూర్తి స్థాయి ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చిన 20 గుర్రాలను..10 జాగిలాలను బంగ్లాదేశ్‌కు భారత సైన్యం బహమతిగా అందించింది.
భారత్- బంగ్లాదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా మందు పాతరలను గుర్తించే 10 శునకాలను, 20 మిలటరీ గుర్రాలను బంగ్లాదేశ్‌కు అందించామని భారత సైన్యం ప్రకటించింది.
ఈ ప్రత్యేక శునకాలు, గుర్రాల నిర్వహణకు సంబంధించి ఆ దేశ సైనికులకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామని తెలిపింది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఇవి సమర్థవంతంగా పనిచేయగలవని..రీమౌంట్, వెటర్నరీ కార్ప్స్ వీటికి ప్రత్యేక తర్ఫీదునిచ్చిందని వెల్లడించింది. ఈ బహుకరణ కార్యక్రమం భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్-బెనాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో జరిగిందని వెల్లడించింది.
భారత ఆర్మీ ప్రతినిధి బృందానికి బ్రహ్మాస్త్రా కార్ప్స్ చీఫ్ మేజర్ జనరల్ నరీందర్ సింగ్ క్రౌడ్ నాయకత్వం వహించగా , బంగ్లాదేశ్ ఆర్మీ ప్రతినిధి బృందానికి జెస్సోర్ ఆధారిత విభాగానికి కమాండింగ్ చేస్తున్న మేజర్ జనరల్ మహ్మద్ హుమయూన్ కబీర్ నాయకత్వం వహించారు.
దీనిపై భారత సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ..భారత సైన్యంలో సైనిక డాగ్స్ పనితీరు చాలా ప్రశంసనీయమని కొనియాడారు. భద్రతకు సంబంధించిన విషయంలో బంగ్లాదేశ్‌కు స్నేహపూర్వక సహాయాన్ని అందించాలని భారత్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.