ఆత్మనిర్భర్ భారత్ : సైనికుల కోసం ప్రత్యేక మెసేజింగ్ యాప్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Indian Army launches secure messaging app SAI for jawans ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా గురువారం(అక్టోబర్-30,2020) భారత ఆర్మీ.. ఓ మెసేజింగ్ యాప్ ను లాంఛ్ చేసింది. “సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్(SAI)”పేరుతో ప్రత్యేకంగా సైనికుల కోసం అభివృద్ధి చేసిన అప్లికేష్ ను ఆర్మీ విడుదల చేసింది. ఇది ఆండ్రాయిండ్ ప్లాట్ ఫాంపై ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా ఎండ్-టు-ఎండ్ సెక్యూర్ వాయిస్, టెక్స్ట్ మెసేజ్ లు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఆర్వీ సర్వీస్ విభాగంలో సురక్షితంగా, హ్యాకింగ్ కు అవకాశం లేకుండా మెజేజ్ లను పంపవచ్చు.



కాగా, హనీ ట్రాపింగ్ వంటి రకరకాల పద్ధతుల ద్వారా మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం, డేటాను రహస్యంగా పొందటానికి చైనా,పాక్ వంటి దేశాలు నిరంతరం మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా సొంతంగా ఒక యాప్ ని ఆర్మీ అభివృద్ధి చేసుకుంది. అధికారిక పనుల కోసం వాట్సాప్ యాప్ ని వాడకూడదని గత ఏడాదే ఆర్మీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సెన్సిటివ్ అపాయింట్మెంట్లకు సంబంధించిన సమాచారం ఉండే అధికారుల ఫేస్ బుక్ అకౌంట్ లను సైతం తొలగించమని కోరింది.



ఇక,ఇప్పుడు సైనికుల కోసం ఆర్మీ ప్రత్యేకంగా రూపొందించిన SAI యాప్…వాట్సాప్,టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్ ల మాదిరిగానే ఉంటుంది. ఇది ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ మెసేజింగ్ ప్రోటోకాల్ ద్వారా పటిష్టమైన భద్రతను వినియోగదారులకు అందిస్తుంది.సైన్యానికి చెందిన ప్రత్యేక అంతర్గత సర్వర్లు, కోడింగ్ దీనికి సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తాయి.



SAI ను రాజస్తాన్ లోని సిగ్నల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సాయి శంకర్ మొదటగా డెవలప్ చేయగా… అనంతరం దీన్ని మిలటరీ గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేసింది భారత ఆర్మీ. ఇతర దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ట్రేస్ చేసేందుకు వీలు లేకుండా, పటిష్టమైన భద్రత ఉండేలా దీన్ని రూపొందించారు. సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయడానికి సాధ్యం కాని SAI…సరళమైన, సురక్షితమైన మెసేజింగ్ యాప్ అని సైనికాధికారులు తెలిపారు.



భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్- CERT, ఆర్మీ సైబర్ గ్రూప్ సంస్థలు ASI యాప్ పనితీరును పరిశీలించాయి. ప్రస్తుతం ఈ యాప్… మేధో సంపత్తి హక్కు (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్) కోసం నమోదు చేసే పనిలో అధికారులు ఉన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన అనంతరం, యాప్ ని iOS ప్లాట్ఫామ్ లలో అందుబాటులోకి ఉంచుతామని అధికార వర్గాలు తెలిపాయి.

Related Tags :

Related Posts :