లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

త్రివర్ణ పతాకానికి అరుదైన గౌరవం : UNSCలో భారత్ జెండా ఆవిష్కరణ..

Published

on

Indian flag unveiled at UNSC : మన భారత జాతీయ పతాకానికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత మువ్వన్నెల జెండా ఆవిష్కృతమైంది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన అంశం మన భారతీయులకు గర్వకారణంగా మరోసారి ఈ అంశాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC))లోని భారత దేశ ప్రాంగణంలో మన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇకపై మన మువ్వన్నెల జెండా ఎప్పటికీ అక్కడే ఉంటుంది. ఇండియాకి దక్కిన ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవాల్సిన అంశం. జనవరి 4న భారత జెండాను ఏర్పాటు చేయడానికి ఓ ముఖ్య కారణం కూడా ఉంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ 8వ సారి అశాశ్వత (తాత్కాలిక) సభ్యదేశంగా చేరిన సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. “ఇండియా 8వ సారి సభ్యత్వాన్ని పొందింది. ఈ సందర్భంగా భద్రతామండలిలో భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి మాట్లాడారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ..ఇది నా దేశానికేకాదు..ఇక్కడి మా టీమ్ కు కూడా చాలా గర్వకారణమని తెలిపారు.

భద్రతా మండలిలో నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు కలిగించినందుకు భారత ప్రధానమంత్రికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని భద్రతామండలిలో భారత్ తరపున శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి తెలిపారు. ఐతే… రెండేళ్లుగా భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్న బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండొనేసియా, సౌత్ ఆఫ్రికాలు ఇప్పుడు సభ్యత్వాన్ని కోల్పోయాయి.

ఆ దేశాలకు భారత్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే… తనతోపాటూ… రెండేళ్లు సభ్య దేశాలుగా ఎంటర్ అవుతున్న ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాలకు భారత్ స్వాగతం తెలిపింది. ఇకపై ఈ దేశాలతో కలిసి ఇండియా ముందుకు సాగనుంది. ప్రపంచ దేశాలు తీసుకునే నిర్ణయాలపై భారత్ తనదైన ముద్ర వేయనుంది. ఇంతకు ముందు ఇండియా… 7వ సారి… 2011-2012లో భద్రతా మండలిలో సభ్యదేశంగా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 2 ఏళ్లు సభ్యురాలిగా ఉండే అవకాశం దక్కింది.