కొవిడ్ పరీక్షకు చౌకైన ‘ఎలక్ట్రిసిటీ ఫ్రీ’ డివైజ్ వస్తోంది.. మన సైంటిస్టు సారథ్యంలోనే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ పరీక్ష నిర్వహించే కొత్త ఎలక్ట్రిసిటీ ఫ్రీ (విద్యుత్ రహిత) డివైజ్ అందుబాటులోకి వస్తోంది. కరోనా వైరస్ టెస్టులో భాగంగా బాధితుల నుంచి లాలాజాల శాంపిల్స్‌ వేరు చేయడంలో ఈ విద్యుత్ డివైజ్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. మన భారతీయ శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు అమెరికాలో ఈ డివైజ్‌ను అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేశారు. చౌకైన, విద్యుత్ రహిత (ఎలక్టిసిటీ ఫ్రీ) సెంట్రిఫ్యూజ్‌ డివైజ్ గా చెబుతున్నారు.

ప్రపంచంలోని పేద దేశాల్లో COVID-19 డయాగ్నస్టిక్స్ యాక్సస్ పెంచుతూ అడ్వా్న్స్ డ్ టెక్నాలజీ వస్తోంది. అమెరికాలోని Stanford Universityకి చెందిన Manu Prakash సహా శాస్త్రవేత్తలు.. ‘Handyfuge’ డివైజ్ చాలా ఎక్కువ వేగంతో శాంపిల్స్ తో కూడిన ట్యూబ్స్ తిప్పుతుందని అంటున్నారు. వైరస్ జన్యువును రోగి లాలాజల శాంపిల్స్ నుంచి వేరు చేయడానికి ఈ డివైజ్ సరిపోతుందని చెబుతున్నారు. విద్యుత్ అవసరం లేకుండా ప్లాట్‌ఫామ్ medRxivలో ప్రచురించారు. చౌకైన సెంట్రిఫ్యూజ్, యూనిట్‌కు 5 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో అసెంబుల్ చేసుకోవచ్చు.

లాలాజల శాంపిల్స్‌లో కరోనావైరస్ జన్యువు ఉనికిని గుర్తించడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు LAMP assay అని పిలిచే చౌకైన డయాగ్నిస్టిక్ టెక్నిక్‌ను నిర్వహించడానికి అనుమతిస్తుందని గుర్తించారు. LAMP ప్రోటోకాల్ పరిశోధకుల ప్రకారం.. సింపుల్‌గా ఉండే ప్రత్యేకమైన డివైజ్‌లు అవసరం లేదు. వేగంగా, శాంపిల్ సేకరణ నుంచి రీడౌట్ వరకు ఒక గంట కన్నా తక్కువ సమయం ఉండాలన్నారు.

ప్రతి రీయాక్షన్‌కు ఒక డాలర్ ఖర్చు అవుతుంది. పరీక్షలో ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. లాలాజల శాంపిల్స్‌లో వైరల్ జన్యువును గుర్తించడం ఆధారంగా రోగనిర్ధారణ పద్ధతుల్లో ఉత్పత్తిలో వైవిధ్యం ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రోగనిర్ధారణ కారకాలను నిరోధించే పదార్థాలు కలిగిన లాలాజలం దీనికి కారణమని వివరించారు.

నిమిషానికి 2వేలు రొటేషన్ చేయగలదు :
నిమిషానికి 2000 రొటేషన్స్ (RPM) అవసరమైన వేగాన్ని సురక్షితంగా అందించగలదు సెంట్రిఫ్యూజ్ డివైజ్. దీనికి నిమిషాలు, వందల డాలర్లు ఖర్చవుతుంది. విద్యుత్ సరఫరా కూడా అవసరం అవుతుంది. హ్యాండిఫ్యూజ్‌తో ఈ సమస్య ఉండదని Stanford University బయో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ప్రకాష్ చెప్పారు.  ఇంతకుముందు ‘Foldscope’ అని పిలిచే చౌకైన ‘origami microscope అభివృద్ధి చేసింది.

విద్యుత్ రహిత LAMP ప్రోటోకాల్ హార్వర్డ్‌లోని సెప్కో ల్యాబ్ అద్భుతంగా రూపొందించారు. కోవిడ్ పరీక్ష అవసరానికి సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తల ప్రకారం.. బొమ్మల షాపు నుంచి తీసిన ఫ్లాష్ లైట్ ఆధారంగా ఈ ఆలోచన మొదలైందని తెలిపారు. రాబే, సెప్కో నుంచి LAMP ప్రోటోకాల్ ఉపయోగించి డివైజ్ పనితీరును ధృవీకరించారు.

READ  డేంజర్ బెల్స్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మరణాల సంఖ్య

హ్యాండిఫ్యూజ్, సెప్కో రాబే నుంచి వచ్చిన పరీక్షతో కలిపి, సింథటిక్ COVID-19 RNAను లాలాజలంలో మైక్రోలిట్రేస్‌కు 10-100 కాపీలు వరకు గుర్తించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ డివైజ్ ఎంతవరకు సమర్థవంతగా సురక్షితంగా పనిచేస్తుందో గుర్తించాలంటే రోగి శాంపిల్స్ ధృవీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోటోకాల్, హ్యాండిఫ్యూజ్‌ను ఫీల్డ్ సెట్టింగులలో పరీక్షించడానికి రెడీ అవుతున్నాయని అధ్యయనంలో తెలిపారు.

Related Posts