మాస్క్ కూడా యూనిఫాం కలర్ లోనే ఉండాలి : ఇండియన్ నేవీ

Indian Navy asks personnel to wear colour coded masks matching with uniform

కరోనా కాలంలో ముఖానికి పెట్టుకునే మాస్క్ లు కూడా వేసుకునే యూనిఫాం కలర్ లోనే ఉండాలని భారత నావికాదళం సిబ్బందికి తెలిపింది. తెల్లని యూనిఫాం లు ఉన్నవారికి తెల్లని మాస్క్. బ్లూ కలర్ యూనిఫాం ఉన్నవారికి బ్లూ కలర్ మాస్క్ లు..ఇలా ఏ కలర్ యూనిఫాం లు ఉంటే ఆ కలర్ మాస్క్ లు ధరించాలని తెలిపింది. 

డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్, ఖాకీ యూనిఫాం ధరించిన ఫైర్ సర్వీసెస్ సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు ఖాకీ మాస్క్‌లు ధరించాలని కోరారు. అలా చేయకుంటే మొదటి సారి 200 రూపాయలు, రెండవ సారి .2,000 వసూలు చేస్తామని తెలిపింది. 

ఈ క్రమంలో సదరు నేవీ సిబ్బంది ధరించే మాస్క్ సౌకర్యవంతంగా ఉండేందుకు కాటన్ తో తయారు చేయిస్తున్నారు. నేవీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ కాటన్ మాస్క్‌లను తయారు చేసిందని..అధికారులు తెలిపారు.

Read: WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన హర్షవర్థన్

మరిన్ని తాజా వార్తలు