లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

200మీటర్లు పాక్ భూభాగంలోకి వెళ్లిన భారత భద్రతా దళాలు

Published

on

Indian security forces went 200 metres inside Pakistan అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాల ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ఇటీవల సైన్యం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని సాంబాలో ఓ టన్నెల్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసకోవడంలో భాగంగా దాదాపు 200మీటర్లు పాకిస్తాన్ భూభాగంలోకి భారత భద్రతా దళాలు వెళ్లినట్లు కేంద్రప్రభుత్వ ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు.కాగా, నవంబర్​ 19న జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై నగ్రోటా వద్ద బాన్ టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. వారి వద్ద 11 ఏకే అసాల్ట్​ రైఫిళ్లు, 3 పిస్టోళ్లు, 29 గ్రెనేడ్లు సహా భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారీ విధ్వంసాన్ని త‌ప్పించారంటూ నగ్రోటా ఘటనలో అధికారుల పనితీరుపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రశంసలు కురిపించారు.అయితే, ఎన్ కౌంటర్ లో హతమైన నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 150మీటర్ల పొడవైన ఓ సొరంగ మార్గం ద్వారా భారత్ లోకి చొరబడినట్లు సరిహద్దు భద్రతా దళం(BSF) నవంబర్-22న గుర్తించింది.అయితే, దాదాపు 200మీట్లరు పాక్ భూభాగంలోకి వెళ్లి ఆ టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ ని భారత భద్రతా దళాలు గుర్తించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, గడిచిన మూడు నెలల్లో సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ గుర్తించిన రెండవ సొరంగ మార్గం ఇది. ఈ ఏడాది ఆగస్టు నెలలో గలర్ ఏరియాలోని బోర్డర్ ఫెన్సింగ్ కు దగ్గర్లో ఉగ్రవాదులు పాక్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఏర్పాటుచేసుకున్న ఓ సొరంగమార్గాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *