లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

India – China Border : లడఖ్ లో 35 వేల భారతీయ సైనికులు

Published

on

India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు.సియాచిన్, లడఖ్ వంటి అత్యంత కోల్డ్ ఏరియాల్లో పనిచేసిన వారు. ఎంత చల్లటి వాతావరణం ఏర్పడిన..వీరు ఎదుర్కొనే సత్తా ఉన్నవారు. త్వరలో చలికాలం సమీపిస్తుండడంతో అక్కడ ఏర్పడే పరిస్థితులను తట్టుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది ఆర్మీ.

ఇక వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. వెచ్చని క్యాబిన్లు, ఇతర సామాగ్రీని సమకూర్చుతున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సియాచిన్, తూర్పు, ఉత్తర లడఖ్ లోని సైనిక శిబిరాల్లో చాలా సంవత్సరాల అనుభవం వీరికి ఉందన్నారు.అదే చైనా సైనికులు అత్యంత క్లిష్టమైన వాతావరణం తట్టుకోలేరని, చైనా సైనికులు 2 నుంచి 3 ఏండ్ల అనంతరం దేశ ప్రధాన ప్రాంతానికి తిరిగి వెళుతుంటారని వెల్లడించాయి. ప్రస్తుతం చలికాలంలో ఏర్పడే అత్యంత అల్పమైన ఉష్ణోగ్రతలను తట్టుకొలేరని వివరించాయి.

ఇరు దేశాల సైనికులు పెట్రోలింగ్ పాయింట్ 14, 15, 17, 17 ఏ నుంచి దూరంగా వెళ్లాయని, కానీ పీపీ 17, 17 ఏ వద్ద సుమారు 50 మంది చైనా సైనికులు మోహరించి ఉన్నారని వెల్లడించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *