US college scam, how to involve college scam for telugu NRI Students

అమెరికా ఆపరేషన్ : అరెస్ట్ అయిన తెలుగు స్టూడెంట్స్ ఏం తప్పు చేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికా అండర్ కవర్ ఆపరేషన్ – పేజ్ ఛేజ్ లో భాగంగా తెలుగు స్టూడెంట్ 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ స్టూడెంట్స్ చేసిన మోసం ఏంటీ.. ఏం చేశారు అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. 2017 ఫిబ్రవరి నుంచి 2019 జనవరి మధ్య ఈ రెండేళ్లలో జరిగిన ఎన్నో మోసాలను అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా అధికారులు గుర్తించారు. అరెస్ట్ అయిన 8 మంది తెలుగు స్టూడెంట్స్ లో ఆ ముగ్గురు ఏం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం…

 

అడ్మిషన్ల రూపంలో కమీషన్లు :

అరెస్ట్ అయిన 8 మంది విద్యార్థుల్లో సామ సంతోష్ రెడ్డి (28) ఒకరు. ఫేక్ యూనివర్శిటీ అని తెలియక.. వర్సిటీ అధికారులకే ఫోన్ చేసి.. క్లాసులకు అటెండ్ కాను.. స్టూడెంట్ గా ఎన్ రోల్ చేసుకోవాలని స్వయంగా కోరాడు. దీన్ని కూడా అధికారులు వాయిస్ రికార్డ్ చేశారు. వర్సిటీకి విదేశీ విద్యార్థులను తీసుకువస్తాను.. ఫీజు రాయితీ ఇవ్వాలని కోరాడు. సామ సంతోష్ రెడ్డి ఫోన్ కాల్ చేసి మాట్లాడిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు. సామ సంతోష్ ఫోన్ చేసిన కొన్ని వారాల తర్వాత కందాల సురేష్, కాకిరెడ్డి భరత్, తక్కెళ్లపల్లి అవినాష్ అనే మరో ముగ్గురు స్టూడెంట్స్ కూడా అదే తరహాలో యూనివర్శిటీలో అండర్ కవర్ లో పని చేస్తున్న అధికారులను కాంటాక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని స్టూడెంట్స్ కు వర్సిటీలో చేరిపిస్తాం, ఫీజు రాయితీలు, కమీషన్ ఎంత ఇస్తారని బేరం పెట్టారు. వర్సిటీ అధికారుల రూపంలో ఉన్న పోలీసులు.. దీనికి ఓకే చెప్పారు. వర్సిటీల పేరుతో అమెరికాలో ఏం జరుగుతుంది.. అక్రమ వలసదారులు ఏయే మార్గాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అని పక్కా ఆధారాలు సేకరించటానికి అధికారులు కూడా వీరికి సహకరించారు. అన్నింటికీ ఒప్పుకున్నారు.

 

20వేల డాలర్ల కమీషన్ తీసుకున్నారు :

స్టూడెంట్స్ ను జాయిన్ చేసినందుకుగాను.. 2017 ఫిబ్రవరి, 2018 జనవరిలో వీరు యూనివర్శిటీలోని అధికారులను కలిశారు. 20వేల డాలర్ల వరకు తీసుకున్నారు.  అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్న అధికారులే వీరికి స్వయంగా 20వేల డాలర్లు ముట్టచెప్పారు. ఆ తర్వాత వీరు అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది. తెలుగు స్టూడెంట్స్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కోసమే అధికారులు వీరికి అడిగినన్ని డాలర్లు ఇచ్చారు. 

See also : ఇండియన్ స్టూడెంట్స్ ఇలా మోసపోయారు

Related Tags :

Related Posts :