హాలీవుడ్‌ను టార్గెట్ చేసిన నాగ్ అశ్విన్.. నాలుగో సినిమాకే భారీ ప్లాన్.. టార్గెట్ ఏంటి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇండియన్ సినిమా సూపర్ స్టార్స్ ప్రభాస్, దీపికా పదుకొణెలను జత చేయడమే కాదు భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేసి హాలీవుడ్ ను టార్గెట్ చేసేందుకు రెడీ అయిపోయారు నాగ్ అశ్విన్. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రెడీ కాబోతున్న ప్రాజెక్టును అమెరికాలో కూడా భారీగానే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. టాలీవుడ్, తెలుగు సినీ పరిశ్రమలో రాయల్ గా దూసుకుపోతున్న ప్రభాస్ పక్కన మోడల్ నుంచి హీరోయిన్ గా మారి గ్లోబల్ స్టార్ అయిన బాలీవుడ్ హీరోయిన్ పెట్టడం వెనుక ఉద్ధేశ్యమేంటి?

అశ్వినీదత్ నిర్మాణంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 2022సంవత్సరానికి 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో తయారువుతోన్న ఈ సినిమాకు బాగా సీనియర్ వ్యక్తి డైరక్షన్ చేస్తున్నాడనుకోవద్దు. నాగ్ అశ్విన్ కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అయిన అశ్విన్ తన స్పెషాలిటీని వాటిల్లోనే చూపించేశాడు. తెలిసిన కథనే మళ్లీమళ్లీ చూడాలనిపించే సినిమాగా మహానటిని రెడీ చేశాడు. ఈ డైరక్టర్, ప్రభాస్ లాంటి యాక్టర్ తో పనిచేసేందుకు దీపికా కూడా థ్రిల్ గా ఫీలవుతున్నానంటూ ట్వీట్ చేసింది.

థ్రిల్ అవడాని కంటే ముందు అద్భుతమైన జర్నీ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నా. అంటూ ట్వీట్ చేసింది. ఇదే సందర్భంగా నాగ్ అశ్విన్ కూడా ట్వీట్ చేశారు. ‘యాక్టర్లను ప్రాజెక్టులు వెతుక్కుంటూ వస్తాయి. ఈ కథకు మిమ్మల్ని ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనమంతా కలిసి మరో ప్రపంచాన్ని మొదలుపెట్టడానికి వెయిట్ చేయలేకపోతున్నా. మీ క్యారెక్టర్లు మరో రోజు వరకూ సర్‌ప్రైజ్ గా ఉంచుదాం’ అని అశ్విన్ ట్వీట్ చేశారు.

వరల్డ్ సినిమా మార్కెట్ లో ఖాతాలు తెరిచిన ప్రభాస్, దీపికాలతో ప్రాజెక్టు చేస్తూ నాగ్ అశ్విన్ కూడా వరల్డ్ వైడ్ సూపర్ హిట్ మూవీ తీయాలనుకుంటున్నారని సమాచారం. నటి సావిత్రి జీవితాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ మరెవ్వరూ తీయలేనంతగా బయోపిక్ ను రూపుదిద్దారు. తెలిసిన కథే అయినా కొత్తగా చూపించారు. ప్రభాస్, పదుకొణెలకు బ్లాక్ బాస్టర్లు ఏం కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకున్న ప్రభాస్.. ఖాతాలో బాహుబలి లాంటి సూపర్ బడా హిట్లతో పాటు మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి బాక్సాఫీస్ హిట్లు ఉన్నాయి.

బాలీవుడ్ లో పద్మావతి, బాజీరావ్ మస్తానీలాంటి సినిమాలతో పాటు XXX: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ లోనూ నటించి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ప్రభాస్ తర్వాతి సినిమా రాధేశ్యామ్.. రాధా కృష్ణ కుమార్ డైరక్షన్ లో గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్దే, భాగ్య శ్రీ, ముర్ళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, శాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, సత్యాన్ లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

READ  Today Gold Rate : రూ.2,300 పడిపోయిన బంగారం ధర

Related Posts