Indians are Online searching for dating more than matrimony Sites : Google Survey

రెండో పనే లేదు : డేటింగ్ సైట్ల సెర్చింగ్ లో ఇండియా నెంబర్ వన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇండియాలో ఎక్కువ శాతం మంది డేటింగ్ గురించే ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నట్టు సెర్చ్ క్వరీస్ ఆధారంగా గూగుల్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 

ఎప్పుడు చూడు ఫోన్లు చూస్తూ ఉంటారు.. ఏం వెతుకున్నారో.. ఎంత బిజీ పనో అని అనుకుంటాం.. ఇలా వెతికే వాళ్లలో 90 శాతం మంది సెర్చ్ చేసేది డేటింగ్ వెబ్ సైట్ల గురించి అంట.. అవ్వా ఈ మాట మేం అంటున్నది కాదు.. గూగుల్ సర్వేలు చెబుతున్న నిజం. ఇండియాలో అత్యంత ఎక్కువగా ఇంటర్నెట్ లో సెర్చింగ్ చేసేది దాని కోసమే అంట.

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వంటి వెబ్ సైట్లు వెతికేవారు. పెళ్లి వద్దు.. డేటింగే ముద్దు అన్నట్టు.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు. కాలం మారింది. కాలానికి తగట్టుగా ట్రెండ్ కూడా మారింది. పెళ్లి సంబంధాల కోసం వెతికే రోజులు పోయాయి. డేటింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఇండియాలో ఎక్కువ శాతం మంది డేటింగ్ గురించే ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నట్టు సెర్చ్ క్వరీస్ ఆధారంగా గూగుల్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 

37 శాతం.. డేటింగ్ సైట్లపైనే ఆసక్తి :
2017తో పోలిస్తే.. 2018లో డేటింగ్ రిలేటెడ్ సెర్చ్ రేటు ఎక్కువగా పెరిగినట్టు తెలిపింది. 37శాతం మంది భారతీయులు గూగుల్లో డేటింగ్ వెబ్ సైట్ల గురించే సెర్చ్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంట. ఇతర మ్యాట్రిమోనీ బ్రాండ్స్, వెబ్ సైట్ల సెర్చ్ తో పోలిస్తే 13 శాతం డేటింగ్ వెబ్ సైట్ల సెర్చింగ్ పెరిగినట్టు నివేదిక గుర్తించింది. డేటింగ్ సెర్చ్ కు సంబంధించి ఇండియన్స్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారనేది కచ్చితమైన సంఖ్యను వెల్లడించలేదు. మ్యాట్రిమోనీ సెర్చ్ ఆధారంగా పరిశీలిస్తే.. డేటింగ్ సెర్చ్ గ్రోత్ అధికంగా ఉన్నట్టు గుర్తించింది. 2019 ఫిబ్రవరిలో భారత మ్యాట్రిమోనీ అధ్యయనం ఆధారంగా గూగుల్ ఇన్ సైట్స్ నివేదిక రిలీజ్ చేసింది. 

92శాతం అధికం.. లవ్ కోసమేనట :
భారతీయుల్లో సాధారణంగా శృంగార భావం కలిగినవారిగా మారిపోతున్నారు. డేటింగ్ పై భారతీయులపై జరిపిన సర్వేలో 92శాతం మంది అత్యధికంగా స్పందిస్తే.. వారిలో 6వేల మంది ఇండియన్స్ లవ్ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ సర్వేలో 24శాతం మంది ఇండియన్స్ ప్రేమను వ్యక్తపర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 21శాతం మంది రొమాంటిక్ డిన్నర్ కోరుకుంటున్నారు. 34 శాతం మంది గిఫ్ట్ లు, 15శాతం మంది హాలీడే ప్లానింగ్ పై ఆసక్తిగా ఉన్నారు. అంతేకాదు.. 86 శాతం మంది భారతీయులు తమ పెళ్లి తర్వాత కూడా వ్యాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు)ను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. 

READ  కలల్లో మనకు మనం ఎలా కనిపిస్తాం? మన శృంగార కలలు వెనుక అర్ధాలను కనిపెట్టారు సైంటిస్టులు

ఫుడ్.. సెర్చ్ లో పిజ్జా ఫస్ట్ :
అలాగే.. 2018లో ఫుడ్ కోసం గూగుల్ సెర్చింగ్ రెట్టింపు అయినట్టు గూగుల్ సర్వే తెలిపింది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ బ్రాండ్లు సహా ఇతర ఫుడ్ డెలివరీ బ్రాండ్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. ఫుడ్ ఐటమ్స్ లో టాప్ సెర్చ్ఐటమ్.. పిజ్జా టాప్ లో నిలిచింది. కొందరు.. బిర్యానీ కోసం వెతికారు. 2018లో యూట్యూబ్ వీడియో సెర్చ్ ల్లో అయితే సైన్స్, హాబీ, కుకింగ్, బ్యూటీ టిప్స్ కోసం ఎక్కువగా వెతికారు. 

Related Posts