దేశంలోనే పొడవైన నదీ రోప్‌వే ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కింద ఉద్ధృతంగా ప్రవహించే బ్రహ్మపుత్రా నది. పైనా… నీలి ఆకాశం… జోరుగా హోరు గాలి వీస్తుంటే… అక్కడ రోప్‌వే అలా అలా వెళ్తుంటే… ఆ థ్రిల్లే వేరు. దేశంలోనే పొడవైన నదీ రోప్‌వే ప్రాజెక్టును అసోం… గౌహతిలో నిర్మించారు. ఈ రోప్‌వేను ఇవాళ జాతికి అంకితం చేశారు అసోం ఆర్థికశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ. అసోంలో కేంద్రం చాలా పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టింది. వాటిలో ఇప్పుడు మరొకటి చేరినట్లైంది.రేపటి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి ఈ రోప్‌వే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పనిచేస్తుంది. కరోనా పోయాక… రాత్రి వరకూ టైమ్ పెంచనున్నారు. మొత్తం 2 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే. ఇటు నుంచి అటువైపుకి 7 నిమిషాల్లో వెళ్లొచ్చు. ప్రతీ క్యారేజ్‌లో 32 మంది ప్రయాణించవచ్చు. కరోనా కారణంగా… ప్రస్తుతం ఒక్కో దాంట్లో 15 మందిని మాత్రమే అనుమతించనున్నారు. అందరూ మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టాన్స్ పాటించాలనే రూల్స్ ఉన్నాయి.

ఈ ట్రిప్‌ వన్ వేకి రూ.60 ఛార్జ్ చేస్తున్నారు. టు వే ట్రిప్‌కి రౌండప్‌గా రూ.100 తీసుకుంటున్నారు. ప్రయాణికులు డైలీ, వీక్లీ, నెలవారీ పాస్‌లు కూడా తీసుకోవచ్చు. ఈ రోప్‌వే… నదికి రెండు వైపులా నివసించవారికి వరం కానుంది. నదికి వరదలు వస్తే… అలాంటప్పుడు ఈ రోప్‌వే కీలకం కానుంది. నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తే… బోట్ సర్వీసులు ఉండవు. అప్పుడు రోప్‌వేనే దిక్కవుతుందిఇలాంటిది కావాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. 11 ఏళ్ల ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. 2006లో రూ.56 కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణం ప్రారంభించారు. ఐతే… 2019 తర్వాత ఈ ప్రాజెక్టు పనుల్లో చాలా వేగం వచ్చింది. దీని వల్ల ప్రయాణికులకు గంట పాటూ సమయం ఆదా కానుంది. ట్రాఫిక్ సమస్యలూ తీరనున్నాయి.


Related Posts