లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

india

మొదటి టెస్ట్ ఓటమికి ప్రతీకారం : రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

Published

on

India’s solid victory over Australia in the cricket second Test match : అడిలైడ్ టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన భార‌త్ ఇప్పుడు అందుకు త‌గ్గ ప్రతీకారం తీర్చుకుంది. ఆతిథ్య జ‌ట్టు ఆప‌సోపాలు ప‌డ్డ పిచ్‌పై మ‌న బౌల‌ర్స్‌, బ్యాట్స్‌మెన్స్ సూపర్బ్‌ పర్‌ఫామెన్స్‌తో ఎనిమిది వికెట్ల తేడాతో రెండో టెస్ట్‌లో ఘ‌న విజయం సాధించారు. ముఖ్యంగా భార‌త బౌల‌ర్స్ విరుచుకుపడటంతో ఆస్ట్రేలియాని రెండు ఇన్నింగ్స్‌లలో 200 ప‌రుగుల లోపే క‌ట్టడి చేశారు. బాల్స్‌ను రాకెట్‌లా విస‌రుతూ బుమ్రా, సిరాజ్‌లు ఆస్ట్రేలియాని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తే అశ్విన్, జ‌డేజాలు త‌న స్పిన్‌ మాయాజాలంతో కంగారూల‌ని కంగారెత్తించారు.

రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ కొద్దిగా ఇబ్బంది ప‌డ్డప్పటికీ, శుభ్‌మ‌న్ గిల్‌, ర‌హానే, జ‌డేజాల అద్భుత బ్యాటింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స‌రిగ్గా 200 ప‌రుగుల‌కు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ టీమ్‌ లో గ్రీన్ , వేడ్ , లబుషేన్ , కమిన్స్ కాసేపు ప్రతిఘ‌టించ‌డంతో భార‌త్ విజయం కాస్త లేట్ అయింది.

70 ప‌రుగుల ల‌క్ష్యంతో లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్ చేప‌ట్టిన టీ మిండియా ఆదిలో రెండు వికెట్లు వెంట వెంట‌నే కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగ‌ర్వాల్ ప‌రుగుల‌కు ఔట్ కాగా, పుజారా ప‌రుగుల‌కు పెవీలియ‌న్ బాట ప‌ట్టారు. తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్ , స్టాండింగ్ కెప్టెన్ ర‌హానే తో క‌లిసి భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో స‌మం అయింది.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘనవిజయం

కెప్టెన్‌గా రహానేకి ఇది మూడో టెస్టు… అలాగే మూడో గెలుపు కూడా… ఇక రహానే సెంచరీ చేసిన గత 12సార్లు ఎప్పుడూ భారత్‌ ఓడిపోలేదు. మెల్‌బోర్న్‌లో భారత్‌కి ఇది నాలుగో గెలుపు. రెండేళ్ల క్రితం బుమ్రా భారత్‌ను గెలిపించాడు. ఈసారి రహానే ఆ బాధ్యత తీసుకున్నాడు. రెండూ కూడా బాక్సింగ్‌ డే టెస్టులే…