లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సూపర్ రిచ్ క్లబ్ : 2020లో 10 మంది కొత్త భారతీయ కుబేరులు

Published

on

India’s super-rich club sees 10 new entrants in 2020 : 2020వ సంవత్సరమంతా కరోనా మహమ్మారితోనే గడిచిపోయింది. ఒక భారత్ మాత్రమే కాదు.. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోయాయి. కానీ, ఈ ఏడాదిలో బిలియనర్ల ఆదాయం మాత్రం అంచెలంచెలుగా ఎదిగింది. ఒకవైపు ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే.. 2020 ఏడాదిలో భారతీయ సూపర్-రిచ్ క్లబ్’లో 10 మంది కొత్త బిలియనీర్లు చేరారు. వీరి ఆదాయం గత ఏడాదితో పోలిస్తే.. 33 శాతం పెరిగింది. 2019 డిసెంబర్ చివరి నాటికి 80 నుంచి 90 బిలియనీర్ల ఆదాయం (డాలర్ పరంగా) ఆల్-టైమ్ గరిష్టానికి పెరిగింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ముఖేష్ అంబానీ నేతృత్వంలో భారతీయ కుబేరులు మొత్తం 483 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే.. 33 శాతం పెరిగింది. భారతదేశ వార్షిక అంచనా స్థూల జాతీయోత్పత్తి (GDP) లో ఐదవ వంతుకు సమానం. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం.. భారత జీడీపీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం తగ్గుతుందని అంచనా. అయితే ఈ గణాంకాలు BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో 807 కంపెనీల ప్రమోటర్ల వాటా మార్కెట్ క్యాప్ బిజినెస్ స్టాండర్డ్ విశ్లేషణ ఆధారంగా ఉన్నాయి.

ఈ జాబితాలో ముఖేశ్ అంబానీ నికర ఆదాయ విలువ 87.5 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు. 2020లో అంబానీ సంపద గణనీయంగా పెరిగింది. గత ఏడాదిలో అంబానీ ఆదాయం దాదాపు 37 శాతం పెరిగింది. వారానికి 410 మిలియన్ డాలర్లను అంబానీ సంపాదించారు. అంబానీ సంపద 2019లో 47 శాతం పెరిగింది. రెండవ స్థానంలో అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ ఫ్యామిలీకి చోటు దక్కింది. 2020లో వీరి సంపద రెట్టింపు అయింది.

విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సిఎల్‌కు చెందిన శివ్ నాదర్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు వంటి టెక్నాలజీ దిగ్గజాల ఆదాయం 2020లో కనీసం 55 శాతం పెరిగింది. ఇక బాబా రామ్‌దేవ్, వ్యాపార భాగస్వామి ఆచార్య బాలకృష్ణ సంపద గరిష్టంగా పెరిగింది. వారి సంపద 2019 చివరినాటికి సుమారు రూ.100 కోట్ల నుంచి దాదాపు రూ .20 వేల కోట్లకు పెరిగింది. ఆసియా పెయింట్స్ (48 శాతం), అవెన్యూ సూపర్‌మార్ట్‌కు చెందిన రాధాకిషన్ దమాని (41 శాతం), సన్ ఫార్మాకు చెందిన దిలీప్ షాంఘ్వీ (36శాతం), సునీల్ మిట్టల్ (21 శాతం) ఉన్నారు. భారతదేశ 10 మంది కొత్త కుబేరులైన ప్రమోటర్లు 2020 ఏడాదిలో వారి సంపదకు 76 బిలియన్ డాలర్లను జోడించారు.  ఇండియాలో మొత్తం ప్రమోటర్ సంపదలో 44 శాతం వాటాను కలిగి ఉన్నారు.