ఒక్క ప్యాసింజర్ రెండు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చంటోన్న INDIGO

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ విమాన ట్రావెలింగ్ సర్వీస్ ఇండిగో కొత్త స్కీం తెచ్చింది. ఒక్క ప్యాసింజర్ పేరుతో రెండు సీట్లు బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి ఉన్న తరుణంలో అదనపు భద్రత గురించి ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తెలిపింది. దీనినే 6E డబుల్ సీట్ సర్వీస్ స్కీమ్ అంటారని.. కస్టమర్లకు ఒత్తిడి లేని ప్రయాణం కోసం ఈ స్కీం వాడుకోవచ్చని సూచించింది.

ఈ మేరకు కస్టమర్ల నుంచి భారీగా రిక్వెస్ లు వస్తున్నాయి. సింగిల్ ప్యాసింజర్ రెండు సీట్లు బుక్ చేసుకోవచ్చు. అదనపు భద్రత అంశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ అన్నారు.

1. ఇండిగో ఫ్లైట్ సీట్ బుక్ చేసుకునే క్రమంలో ఓ ఎక్స్‌ట్రా సీట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
2. తక్కువ ధరలకే సర్వీసు నడిపే ఇండిగో 6E డబుల్ సీట్ సర్వీస్ స్కీమ్ ట్రావెల్ పోర్టల్స్ లో అందుబాటులో ఉండదు. ఇండిగో కాల్ సెంటర్ లేదా ఎయిర్ పోర్ట్ కౌంటర్లలో మాత్రమే వీలవుతుంది.
3. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఇండిగో డబుల్ సీట్ స్కీమ్ వాడుకోవచ్చు.
4. విమాన షెడ్యూల్ సమయాని కంటే 24గంటల ముందు మాత్రమే డబుల్ సీట్ బుక్ చేసుకోవచ్చు.
5. ఇండిగో గ్రూప్ బుకింగ్స్ కు డబుల్ సీట్ స్కీం వర్తించదు.
6. డబుల్ సీట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ సీట్ వేరే వ్యక్తికి గాని, లేదా డబ్బులకు ఇతరులకు అమ్ముకోవడం గానీ చేయకూడదు.
7. డబుల్ సీట్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సీట్ సెలక్షన్ చేసుకోవాలి.
8. డబుల్ సీట్ అంటే కేవలం పక్క సీట్ మాత్రమే బుక్ చేసుకోవాలి.
9. ఒరిజినల్ సీట్ బుకింగ్ కాస్ట్ కంటే 25శాతం తక్కువ ధరకే డబుల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
10. ఈ ఆఫర్ 2020 జులై 24 నుంచి వాడుకోవచ్చని ఎయిర్‌లైన్ స్టేట్‌మెంట్ లో పేర్కొంది.

Related Tags :

Related Posts :