లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు : పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Published

on

Indrakeeladri Navratri Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం మూలానక్షత్రం కావడంతో ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే వేల సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు..బెజవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సాధారణ భక్తులతోపాటు.. వీఐపీలు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు.

ప్రపంచంలో ఏయే దేశాల్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటారంటే?


కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన రోజు. మూలా నక్షత్రం అంటే అమ్మవారి జన్మనక్షత్రం రోజు. ఈ రోజు దుర్గమ్మ సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు. సరస్వతి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం కోసం ప్రతి ఏటా భక్తులు భారీ సంఖ్యలో వస్తారు.ఈ ఒక్కరోజే లక్షల మంది అమ్మవారిని దర్శించుకుని తరిస్తుంటారు. కానీ ఈ సారి అలా లేదు. కరోనా నేపథ్యంలో రోజుకు పదివేల మంది భక్తులకే దుర్గమ్మ దర్శనం కల్పిస్తున్నా రు. ఇవాళ కూడా పదివేల మందికే దుర్గమ్మ దర్శనానికి అనుమతించాలని నిర్ణయించినా…. చివరలో మరో మూడు వేల మంది భక్తులకు అవకాశం కల్పించే అవకాశముంది.

కొండ కింద వున్న కెనాల్ రోడ్ వినాయక టెంపుల్ నుంచి మొత్తం అయిదు క్యూ లైన్లను గత ఏడాది ఏర్పాటు చేస్తే ఈ ఏడాది నాలుగు మాత్రమే ఏర్పాటు చేశారు… భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గతంలో శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేశారు అధికారులు..కానీ ఇప్పుడు అంతరాలయం దర్శనం కూడా రద్దు చేశారు ..కరోనాతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి తగ్గిపోయింది.వీఐపీలను కూడా సాధారణ భక్తులుగానే పరిగణనిస్తున్నామని దేవాలయ అధికారులు చెబుతున్నారు. ఇక అమ్మవారికి మధ్యాహ్నం మూడు గంటల 30 నిముషాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇందుకోసం ఆలయం ప్రాంగణంలో పోలీస్ అధికారులు విస్తృతమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య తగ్గటం మాత్రమే కాదు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూలేదు. ఆఖరికి మూల నక్షత్రం రోజు కూడా కోరుకున్న భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం లభించక పోవటంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *