లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఈ ఫీట్‌తో గంగూలీ లిస్ట్‌లో చేరిపోయిన వాషింగ్టన్ సుందర్

Published

on

Washington Sundar: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇండియన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆట కనబరిచాడు. ఆదివారం తాను చేసిన ఫీట్ తో గంగూలీ సరసన చేరిపోయాడు. గబ్బా వేదికగా హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.

ఏడు బౌండరీలు, ఒక సిక్సు కలిపి 144బంతులకు గానూ 62పరుగులు చేశాడు. ఇంకా ఇలా టెస్టు అరంగ్రేట మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి మూడు వికెట్లు తీసిన టీమిండియా ఐదో క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. హనుమ విహారీ ఈ ఫీట్ ను 2018లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనే సాధించాడు.

అంతకంటే ముందు గంగూలీ (1996)లో, దత్తు ఫాడ్కర్(1947)లో, అమర్‌సింగ్(1932)లో ఈ రికార్డులో ముందున్నారు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే ఈ ఐదుగురు నమోదు చేసిన రికార్డులు విదేశాల్లోనే కావడం గమనార్హం.

నవంబర్ 2017నుంచి ఫస్ట్ క్లాస్ గేమ్ ఆడుతున్న సుందర్.. ఇటీవల బొటనవేలి గాయంతో రవీంద్ర జడేజా తప్పుకోగా అతనికి రీప్లేస్‍‌మెంట్‌గా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అవకాశం సద్వినియోగం పరచుకున్న సుందర్.. స్టీవ్ స్మిత్ ను మొదటి రోజు, కామెరూన్ గ్రీన్, నాథన్ లైయన్ ను తప్పించగలిగాడు.

మూడో రోజు ఆటలో ఇండియా 186/6వద్ద ఉండగా శార్దూల్ ఠాకూర్ తో కలిసి ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టాడు. ఊహించని రీతిలో టెయిలెండర్లు కలిసి ఏడో వికెట్‌కు 123పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.