Home » చేతులకు సంకెళ్లు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
Published
2 months agoon
By
bheemrajTDP MLAs Innovative protest : టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వంపై వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడండి.. ప్రాథమిక హక్కులు పరిరక్షించండంటూ ఎమ్మెల్యేలు నినదించారు.
చేతులకు సంకెళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్చను కాపాడాలని, ప్రజా స్వామ్యానికి ప్రాణం పోయాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని టీడీపీ ఆరోపించింది. దళితులు, బీసీ నేతలపై దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. బీసీ నేతలను టార్గెట్ చేసి వారిపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.