Intelligence Bureau officer Ankit Sharma 26 killed

ఢిల్లీలో ఘర్షణలు : యంగ్ ఐబీ ఆఫీసర్ కళ్లు పీకేసి..గొంతు కోశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలు ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇరువర్గాల మధ్య జరిగిన అల్లర్లలో దాదాపు 20 మందికిపైగా చనిపోయారు. ఇందులో పోలీసులు కూడా ఉండడం అందర్నీ బాధించింది. తాజాగా 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఖజారి చాంద్ బాగ్ నాలాలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. డెడ్ బాడీలను పరిశీలించగా..మిస్పింగ్ అయిన..ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూర్టీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువకుడు అంకిత్ శర్మగా గుర్తించారు. దీంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అంకిత్ శర్మను కత్తులతో దాడి చేసి..ఈడ్చుకెళ్లి..నాలాలో ఆందోళనకారులు పడేశారు. కళ్లు పీకేసి..గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారు. అంకిత్ శర్మ వయస్సు 26 అని అతని సోదరుడు అంకూర్ వెల్లడించారు. ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం సాయంత్రం 4.30గంటల సమయంలో ఇంటికి వచ్చాడని, అయితే..హింసకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నాడని తెలిపారు.

నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి తన సోదరుడు అంకిత్ వెళ్లాడన్నారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి..కాల్వలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతడిని కాపాడేందుకు వెళ్లిన వారిని కూడా..నిరసనకారులు పట్టుకున్నారన్నారు. కాల్పులు జరుపుతూ..అంకిత్ దగ్గరకు ఎవరినీ రానివ్వలేదన్నారు. ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. దుకాణాలు, వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు. మౌజ్ పూర్, బ్రహంపురి, చాంద్ బాగ్, ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కూడా చనిపోయాడు. 

Read More>> దిశ చట్టం కోసం కమిటీ : జగన్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట