లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏపీలో మొదలైన ఇంటర్ ఫస్ట్‌ఇయర్ క్లాసులు..సిలబస్ తగ్గింపు..వేసవి సెలవులు రద్దు

Published

on

Inter first year classes beginning in AP : ఏపీలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్ క్లాసెస్ మొదలయ్యాయి. మే 31వరకు క్లాసులు జరగనున్నాయి. మొత్తం 106 రోజులు పాటు ఇంటర్ తొలి ఏడాది విద్యార్ధులకు క్లాసులు జరగనున్నాయి. రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు. వేసవి సెలవులు రద్దు చేశారు. రెండో శనివారం కూడా క్లాసులు జరపాలని విద్యాశాఖ అన్ని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా క్లాసులు మొదలయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్ధులు ఉత్సాహంగా క్లాసులకు వస్తున్నారు.

సిలబస్‌ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేయాలని నిర్ణయించారు. 30 శాతం సిలబస్‌ను తగ్గించింది విద్యాశాఖ. పరీక్షలు మేలో జరుగుతాయని స్పష్టం చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ట్రిపుల్‌ ఐటి విద్యార్థులకు కూడా ఇవాళ్టి నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. అడ్మిషన్‌ తీసుకునే విద్యార్థులు ఇవాళ ఉదయంలోపు కళాశాలలో రిపోర్టు చేయాలని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఆరో తరగతి విద్యార్థులకు కూడా నేటి నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ ఒక పూట తరగతులు జరుగుతున్న పదో తరగతి విద్యార్ధులకు ఇవాళ్టి నుంచి రెండు పూటలా తరగతులు జరుగుతాయి.