ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

intermediate education is The minimum qualification for government jobs

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా అర్హత ఇంటర్ ఉంటేనే  ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉంది. త్వరలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలకు కనీస అర్హతపై పూర్తి విషయాలను వెల్లడించనుంది. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంతో పాటు అకడమిక్ క్యాలెండర్ అంశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. 

కరోనా వైరస్ వల్ల మార్చి 3 వ వారం నుంచి విద్యార్థుల చదువులకు బ్రేక్ పడింది. పరీక్షలు ముగియకుండానే అర్ధాంతరంగా విద్యాసంవత్సరం ముగిసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించకుండానే 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించాయి.. ఇప్పడుు ఏపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం క్యాలెండర్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ లో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. 

సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరంగా ఉండేది. అయితే కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఈ ఏడాది ఆగష్టు నుంచి 2021 జులై వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఆగష్టు 1 నుంచి 2021 జులై 31 వరకు విద్యా సంవత్సరంగా ప్రకటిస్తూ నిర్ణయించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసిన 2 వారాల తరువాత 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి.

మరిన్ని తాజా వార్తలు