International Film Festival of India: Rajinikanth to be Honoured With Special Icon of Golden Jubilee Award

తమిళ సూపర్ స్టార్ కి గోల్డెన్ జూబ్లీ అవార్డ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలు ప్ర‌తి సంవత్సరం గోవాలో ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈసారి 50వ IFFI  వేడుకలు నవంబర్ 20 నుంచి 28వరకు ఘనంగా జరగనున్నాయి. 

అయితే IFFI-2019 వేడుకల్లో రజనీకాంత్‌ ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. అంతేకాదు విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 

ఈ  విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విటర్ ద్వారా శనివారం (నవంబర్ 2, 2019)న ప్రకటించారు. రజనీకాంత్ ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఇసాబెల్లెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం కూడా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.  

ఈ సందర్భంగా రజినీకాంత్ స్పందిస్తూ.. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌ గౌర‌వం అందించినందుకు ర‌జ‌నీకాంత్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేశారు.

Related Posts