లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డిసెంబర్ 31వరకూ సస్పెండ్

Published

on

International Flights: అంతర్జాతీయ విమానాలను డిసెంబర్ 31వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం తెలిపింది. గతంలో చేసిన సస్పెన్షన్‌ను పొడిగించే క్రమంలో ఇండియా నుంచి ప్రయాణించే విమాన సర్వీసులను డిసెంబర్ 31వరకూ ఆపేశారు. డీజీసీఏ సమాచారాన్ని బట్టి ఇంటర్నేషనల్ విమానాలు కొద్ది రూట్లు వెళ్లేందుకు మాత్రమే అప్రూవల్ దొరికింది.

26-06-2020 సర్క్యూలర్ ప్రకారం.. ప్రస్తుత అథారిటీ ఈ వాయిదాను మరోసారి పొడిగించనుంది. ఇండియా నుంచి బయల్దేరాల్సిన/చేరుకోవాల్సిన కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులను 2020 డిసెంబర్ 31అర్థరాత్రి 11:59నిమిషాల వరకూ రద్దు చేశారు.ఈ నిషేదాజ్ఞలు ఇంటర్నేషనల్ కార్గో విమానాలకు వర్తించవు. దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ సస్పెన్షన్ ను పొడిగించాం. అన్నీ విమాన సర్వీసులను ఇండియన్ గవర్నమెంట్ మార్చి 25నుంచి జాతీయ వ్యాప్తంగా అమలు చేసిన లాక్‌డౌన్‌లోనే రద్దు చేసింది. మే25నుంచి దేశీ సర్వీసులను తిరిగి మొదలుపెట్టారు.

గడిచిన 24గంటల్లో ఇండియాలో 44వేల 489 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసులు 92లక్షల 66వేల 706కు చేరగా.. లక్షా 35వేల 223మంది ప్రాణాలు కోల్పోయారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *