Tesla Artificial intelligence Day 2022: ఆలోచించే రోబోలు.. ప్రపంచానికి పరిచయం చేసిన ఎలాన్ మస్క్.. వీడియో

 ఆలోచించే రోబోలను రూపొందిస్తామని చెప్పిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. ఇప్పటికే మనిషి తరహా రోబోలు ఉన్నప్పటికీ వాటికి ఆలోచించే సామర్థ్యం లేదు. నిన్న టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డే సందర్భంగా ఎలాన్ మస్క్ ఓ కొత్త రోబోను ప్రపంచానికి పరిచయం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే పాలోఆల్టో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో హ్యూమనాయిడ్‌ రోబోను ఆయన చూపారు.

Tesla Artificial intelligence Day 2022: ఆలోచించే రోబోలు.. ప్రపంచానికి పరిచయం చేసిన ఎలాన్ మస్క్.. వీడియో

Tesla Artificial intelligence Day 2022: ఆలోచించే రోబోలను రూపొందిస్తామని చెప్పిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. ఇప్పటికే మనిషి తరహా రోబోలు ఉన్నప్పటికీ వాటికి ఆలోచించే సామర్థ్యం లేదు. నిన్న టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డే సందర్భంగా ఎలాన్ మస్క్ ఓ కొత్త రోబోను ప్రపంచానికి పరిచయం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే పాలోఆల్టో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో హ్యూమనాయిడ్‌ రోబోను ఆయన చూపారు.

దీనికి ఆప్టిమస్‌ అని నామకరణం చేశారు. ద్వారాలు తెరవగానే బయటకు వచ్చిన రోబో అందరికీ అభివాదం చేసింది. మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు బాక్సులను మోయడం లాంటి పనులు చేసింది. ఈ రోబోను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వేదికపై రోబో ఓ సమయంలో సరిగ్గా పనిచేయకపోవడంతో ఇంజినీర్లు వచ్చి దాన్ని రిపైర్ చేశారు. ఈ రోబోలు మరో రెండేళ్ల తర్వాతే విడుదల అయ్యే అవకాశం ఉంది.

టెస్లాకు సంబంధించిన కృత్రిమ మేధతోనే ఈ రోబోలు తయారు అవుతాయి. దాదాపు 20వేల డాలర్ల లోపే ఈ అధునాతన సాంకేతికతో కూడిన రోబోలు అందిస్తామని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. అంతేకాదు, ఈ రోబోలలో సెక్సీ వెర్షన్‌లు కూడా వస్తాయని చెప్పారు. ఈ రోబోలో క్యాట్‌గర్ల్‌ వెర్షన్‌ వస్తుందని తెలిపారు.

రోబోలు శృంగార భాగస్వాములుగా మారడం కూడా అవసరమని గతంలోనూ ఎలాన్ మస్క్ అన్నారు. క్యాట్‌ గర్ల్‌ లాంటి రోబోలను రూపొందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నిన్న కూడా క్యాట్‌ గర్ల్‌ వెర్షన్‌ ఉంటుందని మరోసారి చెప్పారు. రెండేళ్లలో ఈ సెక్సీవెర్షన్‌ రోబోలు మార్కెట్‌లోకి తేవాలనే భావిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

KCR on National Party: నేడు టీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్‌ సమావేశం