America On Jaishankar’s Remarks: భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ చేసిన విమర్శలపై స్పందించిన అమెరికా

‘‘పలు అంశాల్లో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలూ అమెరికాకు భాగస్వామ్య దేశాలు. ఒక దేశంతో బంధాన్ని కొనసాగించే విషయంలో మరో దేశంతో ఉన్న బంధానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోము. ఇందుకు సంబంధించిన పాలసీలను మేము అమలు చేస్తున్నాం. ఏ దేశంతో కొనసాగిస్తున్న బంధం ఆ దేశానికే పరిమితం’’ అని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. అఫ్గానిస్థాన్ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ... ‘‘అఫ్గాన్ కు సాయం చేసే అంశంపై మేము పాకిస్థాన్ తో చర్చలు జరుపుతూనే ఉన్నాం. అఫ్గాన్ లోని ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నాం’’ అని చెప్పింది.

America On Jaishankar’s Remarks: భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ చేసిన విమర్శలపై స్పందించిన అమెరికా

America On Jaishankar’s Remarks: పాకిస్థాన్‌కు అమెరికా ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అమ్ముతుండడాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం స్పందించింది. తాము భారత్ తో పాటు పాకిస్థాన్ తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెబుతూ పాక్ కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయిస్తుండడాన్ని సమర్థించుకుంది. పాక్ తో బంధం వల్ల అమెరికాకు ఏ ప్రయోజనాలు చేకురుతాయని, అటు పాకిస్థాన్‌తో పాటు ఇటు అగ్ర రాజ్యానికి ఎలాంటి లాభమూ ఉండబోదని జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా నిన్న వ్యాఖ్యానించారు.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగానే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయిస్తున్నామని అమెరికా అంటోందని, అయితే, పాకిస్థాన్‌కు వాటిని అందజేస్తే ఆ దేశం వాటిని ఎక్కడ మోహరిస్తుందో అందరికీ తెలుసని అన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎవరినీ ఫూల్స్‌ చేయలేరని అన్నారు. దీనిపైనే తాజాగా అమెరికా ఓ ప్రకటన చేసింది.

‘‘పలు అంశాల్లో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలూ అమెరికాకు భాగస్వామ్య దేశాలు. ఒక దేశంతో బంధాన్ని కొనసాగించే విషయంలో మరో దేశంతో ఉన్న బంధానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోము. ఇందుకు సంబంధించిన పాలసీలను మేము అమలు చేస్తున్నాం. ఏ దేశంతో కొనసాగిస్తున్న బంధం ఆ దేశానికే పరిమితం’’ అని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది.

అఫ్గానిస్థాన్ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ… ‘‘అఫ్గాన్ కు సాయం చేసే అంశంపై మేము పాకిస్థాన్ తో చర్చలు జరుపుతూనే ఉన్నాం. అఫ్గాన్ లోని ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నాం’’ అని చెప్పింది. కాగా, ఉగ్రవాదాన్ని నిరోధించడంలో భాగంగా పాకిస్థాన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయిస్తున్నామని అమెరికా ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పాకిస్థాన్‌కు 450 మిలియన్‌ డాలర్ల సాయం అందిస్తూ అమెరికా సర్కారు నిర్ణయం తీసుకుంది.

Modi Landed in Tokyo: జపాన్ చేరుకున్నానంటూ ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ