Sri Lanka type crisis: శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తమ దేశంలోనూ తలెత్తుతాయన్న అంచనాలపై బంగ్లాదేశ్‌ ప్రధాని స్పందన

శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తమ దశంలో నెలకొనబోవని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పరిస్థితులను బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి పలు దేశాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీనిపై షేక్ హసీనా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిస్థితుల్లోనూ తమ దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. రుణాలు తీసుకునేముందు తమ దేశం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ముందుకు వెళ్తుందని తెలిపారు.

Sri Lanka type crisis: శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తమ దేశంలోనూ తలెత్తుతాయన్న అంచనాలపై బంగ్లాదేశ్‌ ప్రధాని స్పందన

Sri Lanka type crisis

Sri Lanka type crisis: శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తమ దశంలో నెలకొనబోవని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పరిస్థితులను బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి పలు దేశాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీనిపై షేక్ హసీనా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ… కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిస్థితుల్లోనూ తమ దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.

రుణాలు తీసుకునేముందు తమ దేశం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ముందుకు వెళ్తుందని తెలిపారు. అనవసరంగా రుణాలు తీసుకోదని, అలాగే, సరైన సమయానికి బంగ్లాదేశ్ రుణాలకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు. తాము ఏదైనా ప్రాజెక్టు చేపడితే దాని ద్వారా తమ ఆర్థిక వ్యవస్థ ఎలా బలపతుంది? ప్రజలు ఎలా లబ్ధిపొందుతారు? అన్న అంశాలను ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ప్రస్తుతం తమ దేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటోందని ఆమె అన్నారు.

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన