Losing Royal Seal After Queen’s Death: క్యాడ్బరీ చాక్లెట్ సహా 600 సంస్థలు తమ ఉత్పత్తులపై ‘రాయల్ ముద్ర’ను కోల్పోనున్న వైనం

ఈ ముద్రలో ఎడమవైపు ఇంగ్లిష్ సింహం, కుడివైపు స్కాటిష్ ఒంటికొమ్ము గుర్రం, యూకేకు సంబంధించిన మరికొన్ని చిహ్నాలు ఉంటాయి. దీన్ని ఆయా సంస్థలు ఉత్పత్తులు ప్యాకేజ్ చేస్తున్న సమయంలో వాటిపై ముద్రించేవి. క్యాడ్బరీ చాక్లెట్, ఫోర్ట్నమ్-మాసన్ టీ, బుర్బెర్రీ రెయిన్ కోట్లు వంటి ప్రముఖ సంస్థల ఉత్పత్తులపై ఆ ముద్రను చూడొచ్చు. ఆ ముద్రను వేయించుకోవడం గొప్పదనంగా ఆయా సంస్థలు భావించేవి. ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఇచ్చిన సర్టిఫికెట్ లా గుర్తించేవి. ఎలిజబెత్-II కన్నుమూయడంతో, ఆ కుటుంబం ఆయా ఉత్పత్తులను ఇప్పుడూ వాడుతోందని ఆ సంస్థలు నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Losing Royal Seal After Queen’s Death: క్యాడ్బరీ చాక్లెట్ సహా 600 సంస్థలు తమ ఉత్పత్తులపై ‘రాయల్ ముద్ర’ను కోల్పోనున్న వైనం

Losing Royal Seal After Queen's Death

Queen Elizabeth II’s death: బ్రిటన్ రాణి ఎలిజబెత్-II కన్నుమూయడంతో.. ఆమెకు ఇష్టమైన 600 బ్రాండ్లు ‘రాయల్ వారెంట్’ను కోల్పోనున్నాయి. అంటే.. రాణి ఎలిజబెత్-II హయాంలో ఆయా సంస్థల ఉత్పత్తులపై రాయల్ కోట్ చిహ్నాలను ముద్రిస్తూ వస్తున్నాయి. ఆయా ఉత్పత్తులను ఆమె కుటుంబ సభ్యులూ వాడేవారు. దీంతో రాయల్ ముద్రను ఉత్పత్తులపై చూపేవారు. ఈ ముద్రలో ఎడమవైపు ఇంగ్లిష్ సింహం, కుడివైపు స్కాటిష్ ఒంటికొమ్ము గుర్రం, యూకేకు సంబంధించిన మరికొన్ని చిహ్నాలు ఉంటాయి.

దీన్ని ఆయా సంస్థలు ఉత్పత్తులు ప్యాకేజ్ చేస్తున్న సమయంలో వాటిపై ముద్రించేవి. క్యాడ్బరీ చాక్లెట్, ఫోర్ట్నమ్-మాసన్ టీ, బుర్బెర్రీ రెయిన్ కోట్లు వంటి ప్రముఖ సంస్థల ఉత్పత్తులపై ఆ ముద్రను చూడొచ్చు. ఆ ముద్రను వేయించుకోవడం గొప్పదనంగా ఆయా సంస్థలు భావించేవి. ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఇచ్చిన సర్టిఫికెట్ లా గుర్తించేవి. ఎలిజబెత్-II కన్నుమూయడంతో, ఆ కుటుంబం ఆయా ఉత్పత్తులను ఇప్పుడూ వాడుతోందని ఆ సంస్థలు నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఆ ముద్రను మళ్ళీ తమ ఉత్పత్తులపై వేసుకోవడానికి ఇప్పుడు కింగ్ చార్లెస్-III అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ చార్లెస్-III అందుకు అనుమతి ఇవ్వకపోతే ఆ ముద్రను రెండేళ్లలోగా ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల నుంచి తొలగించాల్సి ఉంటుంది. దాని ప్రభావం అమ్మకాలపై పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఫోర్ట్నమ్-మాసన్ టీ ప్రతినిధులు దీనిపై మాట్లాడుతూ… తాము ‘రాయల్ వారెంట్’ను 1954 నుంచి వాడుతున్నామని చెప్పారు. ఇందుకు గర్వపడుతున్నామని అన్నారు.

5,664 fresh COVID-19 cases: దేశంలో కొత్తగా 5,664 కరోనా కేసులు.. నిన్న 14,84,216 వ్యాక్సిన్ డోసుల వినియోగం