Corona Cases in China: చైనాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. లక్షలాది కేసులు వచ్చే ముప్పు

జీరో కొవిడ్ విధానంతో చైనా కష్టాలను కొనితెచ్చుకుంటోంది. ఆ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 10 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో లక్షలాది కేసులు వచ్చే ముప్పు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Corona Cases in China: చైనాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. లక్షలాది కేసులు వచ్చే ముప్పు

Covid cases in india

Corona Cases in China: జీరో కొవిడ్ విధానంతో చైనా కష్టాలను కొనితెచ్చుకుంటోంది. ఆ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 10 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో లక్షలాది కేసులు వచ్చే ముప్పు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా సోకినా చాలా మంది లక్షణాలు కనపడడం లేదు. ఆసుపత్రిలో పడకలు ఐసీయూల సంఖ్య పెంపుపై చైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలను చైనా ఇంటికే పరిమితం చేసింది. అయినప్పటికీ, చైనాలో కరోనా కేసుల విజృంభణ ఆగడం లేదు. కొన్ని వేల మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని, అయితే, కరోనా సోకి బయటపడని వారు కూడా వేలల్లో ఉండొచ్చని వైద్యులు అంటున్నారు.

చైనాలోని అనేక ప్రాంతాల్లో విద్యాలయాలు, రెస్టారెంట్లకు సెలవులు ఇచ్చారు. షాంగ్సీ ప్రావిన్స్ లో కరోనా రోగుల కోసం 22,000 బెడ్లను సిద్ధం చేశారు. ఐసీయూ సామర్థ్యాన్ని 20 శాతం పెంచారు. ప్రపంచ దేశాలు హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నించగా, చైనా మాత్రం మొదటి నుంచి జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. కఠిన ఆంక్షలు పెడుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోతోంది.

CM KCR Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. డిసెంబర్ 14న బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం