Touching Video: వైరల్ వీడియో: నీటిలో మునిగిపోతున్న దుప్పి కోసం తల్లడిల్లిన ఏనుగు

 తన జాతి కాదు అయినా మరొక జంతువు ప్రమాదంలో ఉండడం గమనించి ఆ భారీ జంతు హృదయం తల్లడిల్లింది. తను సాకలేదు అయినా ప్రమాదం నుంచి ఆ చిరు ప్రాణిని రక్షించాలని ఘింకారాలు చేసింది ఆ ఏనుగు.

Touching Video: వైరల్ వీడియో: నీటిలో మునిగిపోతున్న దుప్పి కోసం తల్లడిల్లిన ఏనుగు

Elephnat

Touching Video: తన జాతి కాదు.. అయినా మరొక జంతువు ప్రమాదంలో ఉండడం గమనించి ఆ భారీ జంతు హృదయం తల్లడిల్లింది. తను సాకలేదు.. అయినా ప్రమాదం నుంచి ఆ చిరు ప్రాణిని రక్షించాలని ఘింకారాలు చేసింది ఆ ఏనుగు. నీటిలో మునిగిపోతున్న దుప్పిని రక్షించాలంటూ ఒక ఏనుగు ఘింకరిస్తూ, అక్కడున్న వారిని(సిబ్బందిని) అప్రమత్తం చేసింది. తమ జాతి కాకపోయినా..ప్రమాదంలో ఉన్న సాటి జీవిని రక్షించేందుకు ఆ ఏనుగు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. హృదయాన్ని హత్తుకుంటున్న ఈ దృశ్యం గ్వాటెమాల సిటీలోని ‘లా అరోరా’జూలో చోటుచేసుకుంది. ‘లా అరోరా’జూలో ఉండే ట్రోంపిటా అనే ఏనుగు..తన ఆవరణలో ఉన్న నీటి కుంటలో ఒక దుప్పి(జింక జాతి) పడిపోవడం గమనించింది. నీటి కుంటలో నుంచి బయటకు వచ్చే అవకాశం లేక.. ఆ దుప్పి మునిగిపోతుండగా..అక్కడికి వచ్చిన ఏనుగు దాన్ని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

Other Stories:Russia Serious Warning : చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, తీవ్ర పరిణామాలు తప్పవు- ఆ దేశాలకు రష్యా వార్నింగ్

భయంతో వొణికిపోతున్న దుప్పి..నీటిలో నుంచి బయటకు రాలేక మునిగిపోసాగింది. ఇది గమనించిన ఏనుగు గట్టిగా ఘింకరించి జూ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఏనుగు అరుపులు విన్న జూ సిబ్బంది ఒకరు పరుగున వచ్చి..నీటి కుంటలో మునిగిపోతున్న దుప్పిని గమనించి.. వెంటనే దాన్ని రక్షించారు. అనంతరం ఏనుగు పక్కకు తప్పుకుంది. ఈదృశ్యాన్ని జూ సందర్శనకు వచ్చిన మరియా డియాజ్ అనే యువతి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించింది. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది సూపర్ వైరల్ అయింది.

అది చూసిన నెటిజన్లు..ఏనుగును రారాజు అని అందుకే అంటారు ఒకరు కామెంట్ చేస్తే..ప్రాణి ఏదైనా ప్రాణం ఒకటే కదా అంటూ కామెంట్ చేశారు. ఇక తాను చిత్రీకరించిన ఈ వీడియో వైరల్ అవడంపై మరియా డియాజ్ స్పందిస్తూ..దుప్పి నీళ్ళల్లో పడడం గమనించానని, దాన్ని ఎవరైనా రక్షిస్తే బాగుంటుందని అనుకున్నానని, అంతలోనే ఏనుగు జూ సిబ్బందిని అప్రమత్తం చేసిన తీరు తనను భావోద్వేగానికి గురిచేసిందని తెలిపింది. స్టోరీఫుల్ వైరల్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను మే12న పోస్ట్ చేయగా..నాలుగు రోజుల్లో 60 వేల వ్యూస్ వచ్చాయి.

Other Stories:Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!