Mangoes: ఒక్కో మామిడి పండును రూ.19 వేల చొప్పున అమ్ముతున్న రైతు.. ఎలాగంటే?

Mangoes: ప్రపంచంలోనే అత్యధిక ధర ఉన్న మామిడి పండు ఇదే. దీని విశేషాలేంటో, అది ఇంత ప్రత్యేకం ఎందుకో తెలుసుకుందాం.

Mangoes: ఒక్కో మామిడి పండును రూ.19 వేల చొప్పున అమ్ముతున్న రైతు.. ఎలాగంటే?

Mangoes

Mangoes: మామిడి పండ్లంటే ఇష్టపడని వారు ఉండరు. వేసవిలో దాని రుచి చూడకుండా ఉండలేం. మామిడి పండ్లలో అనేక రకాలు ఉంటాయి. మనకు మార్కెట్లో దొరికే మామిడి పండ్లు కిలో రూ.100 వరకు ఉంటాయి. అయితే, జపాన్ లో ఓ వ్యక్తి పండిస్తోన్న మామిడి పండు ధర రూ.19,000. కిలో మామిడి పండ్ల ధర కాదు.. ఒక్క మామిడి పండు ధర అంతగా ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక ధర ఉన్న మామిడి పండు ఇదే. దీని విశేషాలేంటో, అది ఇంత ప్రత్యేకం ఎందుకో తెలుసుకుందాం. జపాన్ కు చెందిన హిరోయుకి నకగావా అనే 62 ఏళ్ల వ్యక్తి తన తోటల్లో ఫాగీ గ్రీన్‌హౌస్ లో ఈ మామిడి పండ్లను పండిస్తున్నారు. జపాన్ లోని హొక్కడొ ద్వీపంలో ఉండే తోకచీలో ఆయన తోట ఉంది.

సేంద్రీయ విధానంలో మామిడి పండ్లను పండిస్తున్నారు. నకగావా 2011 నుంచి మామిడి చెట్లను పెంచుతున్నారు. అక్కడ డిసెంబరులో -8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ సమయంలో నకగావా ఫాగీ గ్రీన్‌హౌస్ లోపల మాత్రం 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు.

ఆ రైతు చేస్తున్న సుస్థిర వ్యవసాయం ఆయనకు ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప పేరును తీసుకొచ్చింది. మామిడి పండ్ల విషయంలో తాను చేస్తోన్న ప్రయోగాల వల్ల ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే మామిడిని పండిస్తానని తాను ఊహించలేదని నకగావా తెలిపారు. మొదట తన ప్రయోగాలను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని అన్నారు.

తాను సహజ సిద్ధంగా ఏదైనా చేయాలనుకుని ఈ ప్రయోగాలు మొదలు పెట్టానని చెప్పారు. గతంలో ఆయనకు పెట్రోలియం కంపెనీ ఉండేది. హకుగిన్ నో తైయో బ్రాండ్ పేరుతో ఆయన మామిడి పండ్లు విక్రయిస్తున్నారు. హకుగిన్ నో తైయో అంటే మంచులో ఎండ అనే అర్థం ఉంది.

Jagityala Accident : పదేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి తండ్రి వచ్చిన గంట వ్యవధిలోనే.. రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం