Rishi Sunak: దీపావళి సందర్భంగా తన అధికారిక నివాసంలో పూజల్లో పాల్గొన్న యూకే ప్రధాని రిషి సునక్

దీపావళి సందర్భంగా యూకే ప్రధాని రిషి సునక్ తన అధికారిక నివాసంలో నిన్న రాత్రి పూజల్లో పాల్గొన్నారు. బ్రిటన్ కు బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను చేయగలిగిన పనులన్నీ చేస్తానని అన్నారు. భవిష్యత్తు తరాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుకుని, వారు భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉండేటట్లు చేస్తానని అన్నారు. తన నివాసంలో దీపావళి విందులో పాల్గొన్న ఫొటోను ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Rishi Sunak: దీపావళి సందర్భంగా తన అధికారిక నివాసంలో పూజల్లో పాల్గొన్న యూకే ప్రధాని రిషి సునక్

Rishi Sunak: దీపావళి సందర్భంగా యూకే ప్రధాని రిషి సునక్ తన అధికారిక నివాసంలో నిన్న రాత్రి పూజల్లో పాల్గొన్నారు. బ్రిటన్ కు బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను చేయగలిగిన పనులన్నీ చేస్తానని అన్నారు. భవిష్యత్తు తరాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుకుని, వారు భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉండేటట్లు చేస్తానని అన్నారు. తన నివాసంలో దీపావళి విందులో పాల్గొన్న ఫొటోను ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

రిషి సునక్ ‘ఇన్ఫోసిస్‌’ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత అన్న విషయం తెలిసిందే. ఆయన బ్రిటన్ లోని ఆలయాల్లో తన భార్య అక్షతా మూర్తితో కలిసి పండుగ రోజుల్లో పూజల్లో పాల్గొంటారు. తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటారు. హిందూమత ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తారు. కాగా, బ్రిటన్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఉప ప్రధానిగా డొమినిక్‌ రాబ్‌ని నియమించారు.

ఆర్థిక మంత్రిగా ఉన్న జెరిమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కుదేలవుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆయా పరిస్థితులను నియంత్రించేందుకు రిషి సునక్ ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..