Imran Khan: భారత్ నుంచి వచ్చిన బంగారు పతకాన్ని ఇమ్రాన్ ఖాన్ అమ్మేశారు: పాక్ రక్షణ శాఖ మంత్రి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో భారత్ నుంచి వచ్చిన బంగారు పతకాన్ని అమ్మేశారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో వచ్చిన ఖరీదైన బహుమతులను ఇమ్రాన్ ఖాన్ తక్కువ ధరకు సొంతం చేసుకుని, తిరిగి వాటిని అమ్ముకుంటున్నారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరో విషయాన్ని తెరమీదకు తీసుకురావడం గమనార్హం.

Imran Khan: భారత్ నుంచి వచ్చిన బంగారు పతకాన్ని ఇమ్రాన్ ఖాన్ అమ్మేశారు: పాక్ రక్షణ శాఖ మంత్రి

Imran Khan

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో భారత్ నుంచి వచ్చిన బంగారు పతకాన్ని అమ్మేశారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో వచ్చిన ఖరీదైన బహుమతులను ఇమ్రాన్ ఖాన్ తక్కువ ధరకు సొంతం చేసుకుని, తిరిగి వాటిని అమ్ముకుంటున్నారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరో విషయాన్ని తెరమీదకు తీసుకురావడం గమనార్హం.

తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… ‘‘భారత్ నుంచి అందుకున్న బంగారు పతకాన్ని ఖాన్ అమ్మేశాడు’’ అని చెప్పారు. అయితే, ఆ బంగారు పతకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన చెప్పలేదు. ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన బహుమతులను అమ్ముకోవడం రాజ్యాంగ విరుద్ధం కాకపోయినప్పటికీ, నైతిక విలువలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ వివాదం విషయంలో ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన తప్పుడు సమాచారం గతంలో ఆయనను చిక్కుల్లో పడేసింది. తనకు వచ్చిన బహుమతుల్లో నాలుగింటిని అమ్మేశానని చివరకు సెప్టెంబరు 8న ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..