K-pop group BTS members: సైన్యంలో చేరడానికి సన్నద్ధమవుతున్న కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ యువకులు

దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ యువకులు రెండేళ్ల పాటు తమ దేశ సైన్యంలో చేరనున్నారు. దక్షిణ కొరియాలో 18-28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు రెండేళ్ల పాటు సైన్యంలో చేరి సేవలు అందించాలన్న నిబంధన ఉంది. అయితే, కే-పాప్ బ్యాండ్ సభ్యులకు నిర్బంధ సైనిక సేవల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం చాలా కాలంగా యోచిస్తోంది. అంతేగాక, ఆ బ్యాండ్‌లోని ఏడుగురికి రెండేళ్ల వయసు సడలింపు ఇచ్చారు. అయినప్పటికీ, ఆ బ్యాండ్ లోని సభ్యులు సైన్యంలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

K-pop group BTS members: సైన్యంలో చేరడానికి సన్నద్ధమవుతున్న కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ యువకులు

K-pop group BTS members

K-pop group BTS members: దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ యువకులు రెండేళ్ల పాటు తమ దేశ సైన్యంలో చేరనున్నారు. దక్షిణ కొరియాలో 18-28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు రెండేళ్ల పాటు సైన్యంలో చేరి సేవలు అందించాలన్న నిబంధన ఉంది. అయితే, కే-పాప్ బ్యాండ్ సభ్యులకు నిర్బంధ సైనిక సేవల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం చాలా కాలంగా యోచిస్తోంది. అంతేగాక, ఆ బ్యాండ్‌లోని ఏడుగురికి రెండేళ్ల వయసు సడలింపు ఇచ్చారు.

ఈ బ్యాండ్ లోని వారు 30 ఏళ్ల వయసులోపు సైన్యంలో చేరవచ్చు. ఈ మేరకు రెండేళ్ల క్రితమే దక్షిణ కొరియా పార్లమెంటులో బిల్ కు ఆమోద ముద్ర వేశారు. ఈ బ్యాండ్‌లో అందరి కంటే పెద్దవాడు జిన్. అతడి వయసు 29. ఈ బ్యాండ్ లోని వారికి నిర్బంధ సైనిక సేవల నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నప్పటికీ.. జిన్ వచ్చే నెల నుంచి సైన్యంలో చేరడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆ బ్యాండ్ మేనేజ్‌మెంట్ నిన్న తెలిపింది. ఆ బ్యాండ్ లోని వారే స్వయంగా సైన్యంలో చేరాలని నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో.. కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ యువకులకు నిర్బంధ సైనిక సేవల నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న చర్చకు తెరపడుతోంది.

ఆ బ్యాండ్ లోని మిగతా ఆరుగురూ త్వరలోనే సైన్యంలో చేరాలని భావిస్తున్నారు. కాగా, తమ బ్యాండ్ కొంత కాలం బృందంగా ప్రదర్శనలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుందని ఆ బ్యాండ్ కొన్ని నెలల క్రితం తెలిపింది. ప్రస్తుతం ఆ బ్యాండ్‌లోని కొందరు వ్యక్తిగతంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. బీటీఎస్ బ్యాండ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ టీమ్ విడుదల చేసిన ఆల్బమ్స్ అత్యధికంగా అమ్ముడుపోతాయి. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు ఆ బ్యాండ్ ఎంతగానో తోడ్పడింది.

రెండేళ్ల క్రితం ప్రకటించిన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం బీటీఎస్ మొత్తం కలిపి రూ.400 కోట్ల వరకు సంపాదించింది. అయితే, ది వెల్త్ రికార్డ్ వెబ్‌సైట్ ప్రకటించిన నివేదిక ప్రకారం.. 2022లో ఆ బ్యాండ్ సంపద సుమారు రూ. 800 కోట్లు ఉంటుంది. దక్షిణ కొరియా నిర్బంధ సైనిక సేవల నిబంధనల నుంచి ఒలింపిక్ పతకాల విజేతలు, ఇతర క్రీడాకారులు, డ్యాన్సర్లు వంటి వారికి గతంలో మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు సైన్యంలో చేరితే కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ యువకులు అంతా కలిసి మళ్ళీ 2025లోనే ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య ఎన్నో ఏళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో దక్షిణ కొరియాలో ఇంకా నిర్బంధ సైనిక సేవల నిబంధన కొనసాగుతోంది. ఆ దేశంలోని వారంతా 18-28 మధ్య కనీసం రెండేళ్ల పాటు సైన్యంలో సేవలు అందించాల్సిందే.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..