‘Man of the Hole’ in Brazil: ఎవరికీ కనపడకుండా 26 ఏళ్ళుగా ఒంటరిగా అడవిలో జీవిస్తోన్న వ్యక్తి మృతి.. అంతరించిన అతడి జాతి

బ్రెజిల్‌లో జనజీవన స్రవంతికి దూరంగా, మనుషులను కనపడకుండా అడవుల్లో ఓ తెగ నివసించేది. ఆ ఆటవిక తెగకు చెందిన వారిని 1970 దశకం తొలినాళ్ళలో కొందరు పశువుల కాపరులు చంపేశారు. అటవీలోని భూమి కోసమే ఈ పని చేశారు. అయితే, వారిలో ఆరుగురు మాత్రం ప్రాణాలతో మిగిలారు. వారిలో ఐదుగురిని 1995లో అక్రమ మైనింగ్ మాఫియా చంపేసింది. వారి నుంచి తప్పించుకున్న ఒకే ఒక వ్యక్తి మాత్రం ఇన్నాళ్ళు అడవిలోనే నివసిస్తున్నాడు.

‘Man of the Hole’ in Brazil: ఎవరికీ కనపడకుండా 26 ఏళ్ళుగా ఒంటరిగా అడవిలో జీవిస్తోన్న వ్యక్తి మృతి.. అంతరించిన అతడి జాతి

'Man of the Hole' in Brazil

‘Man of the Hole’ in Brazil: బ్రెజిల్‌లో జనజీవన స్రవంతికి దూరంగా, మనుషులను కనపడకుండా అడవుల్లో ఓ తెగ నివసించేది. ఆ ఆటవిక తెగకు చెందిన వారిని 1970 దశకం తొలినాళ్ళలో కొందరు పశువుల కాపరులు చంపేశారు. అటవీలోని భూమి కోసమే ఈ పని చేశారు. అయితే, వారిలో ఆరుగురు మాత్రం ప్రాణాలతో మిగిలారు. వారిలో ఐదుగురిని 1995లో అక్రమ మైనింగ్ మాఫియా చంపేసింది. వారి నుంచి తప్పించుకున్న ఒకే ఒక వ్యక్తి మాత్రం ఇన్నాళ్ళు అడవిలోనే నివసిస్తున్నాడు.

అతడి గురించి బ్రెజిల్ ప్రభుత్వానికి 1996లో తెలిసింది. అతడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? అన్న విషయాలను అధికారులు తెలుసుకుంటున్నారు. తన జాతి అంతరించాక దాదాపు 26 ఏళ్ళుగా అతడు ఒంటరిగా అడవిలోని చెట్లు, జంతువుల మధ్య ఉంటున్నాడు. అతడి పేరు ఏంటో, ఆ తెగవారు అసలు పేర్లు పెట్టుకుంటారో కూడా తెలియదు. అయితే, అతడిని ‘మ్యాన్ ఆఫ్ ది హోల్’గా అధికారులు పిలుస్తుంటారు. ఎందుకంటే దాచుకోవడానికి, జంతువులను పట్టి తినడానికి అతడు గోతులు తొవ్వుతూ ఉండేవాడు.

రోన్డోనియాలోని తనారు ప్రాంతం సమీపంలో అడవిలో అతడు కర్రలు, ఆకులతో నిర్మించుకున్న గుడిసె బయట ఆగస్టు 23న అతడి మృతదేహం లభ్యమైందని అధికారులు చెప్పారు. అతడి వయసు దాదాపు 60 ఉంటుందని వివరించారు. అతడి మృతితో అతడి జాతి పూర్తిగా అంతమైందని చెప్పారు. అతడు నిద్రపోవడానికి తాడు, ఊడలతో కట్టుకున్న ఊయలలో అతడి మృతదేహం కనపడిందని, శరీరానికి పక్షుల ఈకలు కట్టుకుని తిరిగేవాడని, మృతదేహంపై అవి కనపడ్డాయని చెప్పారు.

అతడు కొన్నేళ్ళుగా అడవిలో పదుల సంఖ్యలో గుడిసెలాంటి నిర్మాణాలు చేసుకున్నాడని అధికారుల చెప్పారు. అతడు దాదాపు 40-50 రోజుల క్రితమే సహజ కారణాలతో చనిపోయినట్లు తెలుస్తోందని అన్నారు. అతడికి ఎవరూ చంపలేదని అక్కడి పరిసరాలు చూస్తే తెలుస్తోందని చెప్పారు. అతడు, అతడి తెగ ఏ భాషలో మాట్లాడుకునేదన్న విషయం గురించి కూడా ఎవరికీ తెలియదని అన్నారు. 2018లో బ్రెజిల్ ప్రభుత్వానికి చెందిన గిరిజన సంక్షేమ వ్యవహారాల అధికారులు ఓ సారి అతడిని అనుకోకుండా చూసి, వీడియో తీయడానికి ప్రయత్నించారని, అతడు అప్పట్లో చెట్టును నరుకుతూ కనపడ్డాడని చెప్పారు.

Congress president election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్న శశి థరూర్?