PM Modi Japan tour: టోక్యోలో జపాన్‌ ప్రధాని కిషిడాతో మోదీ భేటీ.. పలు అంశాలపై చర్చ

జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (64)తో టోక్యోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇవాళ తెల్లవారుజామున మోదీ జపాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ టోక్యోలో నిర్వహించనుండడంతో ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి మోదీ వెళ్లారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు టోక్యో చేరుకున్నారు.

PM Modi Japan tour: టోక్యోలో జపాన్‌ ప్రధాని కిషిడాతో మోదీ భేటీ.. పలు అంశాలపై చర్చ

PM Modi Japan tour: జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (64)తో టోక్యోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇవాళ తెల్లవారుజామున మోదీ జపాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ టోక్యోలో నిర్వహించనుండడంతో ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి మోదీ వెళ్లారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు టోక్యో చేరుకున్నారు.

అలాగే, దాదాపు 100 దేశాల ప్రతినిధులు అబే అంత్యక్రియలకు హాజరవుతున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా మోదీ కిషిడాతో ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. అలాగే, ప్రాంతీయ‌, అంతర్జాతీయ స‌మ‌స్య‌లు, ఇరు దేశాల వ్యూహాత్మ‌క సంబంధాల గురించి చర్చించారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, షింజో అబే మృతి పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు.

భారత్ తో షింజో అబేకు ఉన్న అనుబంధం గురించి ఫుమియో కిషిడా వద్ద ప్రస్తావించారు. షింజో హయాంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయని అన్నారు. భారత్-జపాన్ మధ్య ఉన్న బంధం కిషిడా నేతృత్వంలో మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. షింజో అబేను ఈ ఏడాది జూలై 8న ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొనగా ఆయనను దుండగులు కాల్చి హత్య చేశారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 3,230 మందికి కొవిడ్