“Remain Vigilant” India Cautions: కెనడాలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

కెనడాలోని భారతీయులకు, ముఖ్యంగా అక్కడి భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ‘‘కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింస, విద్వేషపూరిత ఘటనలు, నేరాలు పెరిగిపోతున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ, కెనడాలోని హైకమిషన్ జనరల్ ఇప్పటికే అక్కడి అధికారులతో మాట్లాడింది. భారతీయులపై విద్వేషపూరిత ఘటనలపై విచారణ జరిపించాలని, నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

“Remain Vigilant” India Cautions: కెనడాలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

"Remain Vigilant" says India

“Remain Vigilant” India Cautions:  కెనడాలోని భారతీయులకు, ముఖ్యంగా అక్కడి భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ‘‘కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింస, విద్వేషపూరిత ఘటనలు, నేరాలు పెరిగిపోతున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ, కెనడాలోని హైకమిషన్ జనరల్ ఇప్పటికే అక్కడి అధికారులతో మాట్లాడింది. భారతీయులపై విద్వేషపూరిత ఘటనలపై విచారణ జరిపించాలని, నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే, కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ చెప్పింది. ‘‘పైన చెప్పిన విధంగా కెనడాలో భారతీయులపై నేరపూరిత ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి భారత పౌరులు, ఇండియా నుంచి కెనడాకు చదువు కోసం వెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండాలి’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

అంతేగాక, కెనడాలోని భారతీయులు తమ పేర్లను madad.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని లేదంటే కెనడాలోని భారత హై కమిషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని చెప్పింది. దీనిద్వారా అత్యవసర సమయంలో భారతీయులతో మాట్లాడేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. కెనడాలో భారతీయులపై పెరిగిపోతున్న విద్వేషపూరిత దాడులపై విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రేరేపిత అతివాద శక్తులు భారతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని చెప్పారు.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా