South Korea, America drills: ఉత్తర కొరియా చర్యలకు ప్రతిగా అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు.. మళ్ళీ పెరిగిన ఉద్రిక్తతలు 

ఉత్తర కొరియా దాదాపు రెండు వారాల వ్యవధిలో ఆరు సార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించడంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమయ్యాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఆపకపోవడంతో అమెరికా న్యూక్లియర్ ఆధారిత వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగాన్, దక్షిణ కొరియా యుద్ధ నౌకలు కొరియన్ ద్వీపకల్పం తూర్పు తీర ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో విన్యాసాలు చేపట్టాయి. రెండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలు చేపట్టనున్నాయి.

South Korea, America drills: ఉత్తర కొరియా చర్యలకు ప్రతిగా అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు.. మళ్ళీ పెరిగిన ఉద్రిక్తతలు 

South Korea, America drills: ఉత్తర కొరియా దాదాపు రెండు వారాల వ్యవధిలో ఆరు సార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించడంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమయ్యాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఆపకపోవడంతో అమెరికా న్యూక్లియర్ ఆధారిత వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగాన్, దక్షిణ కొరియా యుద్ధ నౌకలు కొరియన్ ద్వీపకల్పం తూర్పు తీర ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో విన్యాసాలు చేపట్టాయి. రెండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలు చేపట్టనున్నాయి.

తమ దేశాన్ని ఆక్రమించడానికే అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు చేపడుతున్నాయని చాలా కాలంగా ఉత్తర కొరియా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ మిత్ర దేశాల రక్షణ సామర్థ్యాలను బలపర్చుకోవడానికే ఈ విన్యాసాలు చేపడుతున్నామని దక్షిణ కొరియా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తర కొరియా ఏవైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి తమ విన్యాసాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

అయితే, అమెరికా, దక్షిణ కొరియా మరోసారి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుండడంతో ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కు తగ్గకపోవడమే కాకుండా మరిన్ని క్షిపణి పరీక్షలు చేసే అవకాశమూ ఉంది. ‘‘అమెరికా, దక్షిణ కొరియా కొత్తగా చేపట్టిన ఈ విన్యాసాలు కొరియా ద్వీపకల్పంలో స్థిరత్వానికి ముప్పు కలిగించేలా ఉన్నాయి’’ అని ఉత్తరకొరియా ఓ ప్రకటన చేసింది. కాగా, నిన్న ఉదయం కూడా ఉత్తర కొరియా రెండు స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించిన విషయం విదితమే.

దీంతో ఇప్పటికే దక్షిణ కొరియా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి దీనిపై చర్చలు జరిపింది. తాము ఉత్తర కొరియా చర్యలపై దీటుగా ప్రతిస్పందిస్తామని చెప్పింది. అలాగే, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. మరోవైపు నిన్న కూడా జపాన్‌-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..