Russia-Ukraine War: రష్యా నుంచి 69 క్షిపణులు దూసుకువచ్చాయి.. 54 క్షిపణులను తిప్పికొట్టాం: ఉక్రెయిన్

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం రష్యా పెద్ద ఎత్తున క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రష్యా నుంచి మొత్తం 69 క్షిపణులు దూసుకువచ్చాయని వాటిలో 54 క్షిపణులను తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది.

Russia-Ukraine War: రష్యా నుంచి 69 క్షిపణులు దూసుకువచ్చాయి.. 54 క్షిపణులను తిప్పికొట్టాం: ఉక్రెయిన్

Russia-ukraine war crimea bridge

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం రష్యా పెద్ద ఎత్తున క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రష్యా నుంచి మొత్తం 69 క్షిపణులు దూసుకువచ్చాయని వాటిలో 54 క్షిపణులను తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది.

‘‘దురాక్రమణకు పాల్పడాలనుకుంటున్న రష్యా ఇవాళ గగనతల, సముద్రతల క్రూయిజ్ క్షిపణులు, వైమానిక దాడుల నిరోధక క్షిపణులతో మా దేశ విద్యుత్ సౌకర్యాలపై దాడులకు ప్రయత్నించింది’’ అని ఉక్రెయిన్ మిలిటరీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. రష్యా చేస్తోన్న దాడులను పశ్చిమ దేశాల ఆయుధ, సాంకేతిక సాయంతో ఉక్రెయిన్ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

కొన్ని గంటల క్రితం ఉక్రెయిన్ పై రష్యా పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేసింది. కొన్ని వారాల వ్యవధిలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే. దీంతో ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం తలెత్తింది. ఇవాళ ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా రష్యా దాడులపై ఓ ప్రకటన చేశారు.

రష్యా 120 క్షిపణులతో దాడులు చేసిందని చెప్పారు. ఎంతమంది మృతి చెందారన్న విషయంపై వివరాలు తెలియరాలేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో 40 శాతం మందికి ప్రస్తుతం విద్యుత్ అందడం లేదు. రష్యా డ్రోన్లతోనూ దాడులు చేస్తోంది.

Uzbekistan Cough Syrup Death: ఉజ్బెకిస్తాన్‌లో 18మంది చిన్నారులు మృతి.. ఇండియాలో తయారైన దగ్గు మందే కారణమట